ఈ పవిత్ర క్షేత్రం కృష్ణా నదీతీరంలో ఉన్నది. స్వామివారు పంచ నారసింహ అవతారాలలో కొలువై
ఉన్నాడు.
కొండపైన జ్వాలా నరసింహస్వామి, కృష్ణానదిలో స్నానఘట్టంనకు దగ్గరలో కనిపించే స్వామి సాలగ్రామ రూపం. వేదాద్రికి సమీపంలోని గరుడాచల కొండపై వీరనరసింహస్వామి కొలువై ఉన్నాడు. శ్రీ యోగానందనరసింహస్వామి రూపం ఎక్కడా లేనంత సుందరంగా ఉంటుంది. ఈ విగ్రహం త్రేతాయుగంలో దశరథ మహారాజు అల్లుడైన రుష్యశృంగ మహర్షిచే ప్రతిష్టింపబడనది. విఘ్నేశ్వరుడు క్షేత్రపాలకుడు. శ్రీనాధమహాకవి కాశీఖండంలో ఈ క్షేత్ర మహిమ గురించి ప్రస్తావించబడినది. ప్రతి సంవత్సరం వైశాఖమాసం పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుపుతారు.
క్షేత్ర చరిత్ర: సోమకాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుని దగ్గరనుండి వేదాలను దొంగిలించి సముద్రగర్భంలో దాస్తాడు. శ్రీ మహావిష్ణువు మత్సావతారంలో సోమకాసురుని సమంహరించి వేదాలను రక్షిస్తాడు. అప్పుడు వేదాలు స్వామివారి సన్నిధిలో ఉండి తరించే విధంగా కోరడంతో స్వామివారు నరసింహావతారంలో హిరణ్యకశిపుని వధించిన తరువాత ఆ కోరిక తీరుతుందని వరమిస్తాడు. హరణ్యకశిపుని వధించిన అనంతరం స్వామివారు అయిదు రూపాలలో ఇక్కడ అవతరించాడు. అప్పటినుండి కృష్ణానదిలో ఉన్న స్వామివారి సాలగ్రామ రూపాన్ని నిత్యం అభిషేకిస్తుంది.
ఎలా వెళ్ళాలి ? వేదాద్రి కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన గ్రామం. విజయవాడ-హైదరాబాద్ 9వ నెంబర్ జాతీయరహదారిలో చిల్లకల్లు గ్రామానికి 10 కిలో మీటర్ల దారిలో ఉన్నది. చిల్లకల్లులో దిగి అక్కడనుండి బస్సులలో వెళ్ళవచ్చు.