పంచారామ క్షేత్రాలో ఒకటైన సోమారామం (శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామివార్ల దేవస్థానం) భీమవరం పట్టణం గునుపూడి గ్రామంలో ఉన్నది. ఇక్కడ స్వామివారిని సోమేశ్వరుడని పిలుస్తారు. ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉన్నది. మాము రోజులో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాశ్వ నాటికి గోధుమ రంగులోకి మారుతుంది. తిరిగి పౌర్ణమి నాటికి తెలుపు రంగులోకి మారుతుంది. ఈ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించటం చేత ఈ లింగాన్ని సోమేశ్వరలింగం అంటారు. దేవాలయానికి ఎదురుగా చంద్రకుండం అనే చెరువు కలదు. దీనిని కూడా చంద్రుడే ఏర్పాటు చేశాడని స్ధలపురాణం. ఈ చెరువు తామర పువ్వులతో నిండి వుంటుంది.
దేవాలయ విశేషాలు : దేవాలయానికి ఎదురుగా ఎత్తయిన గోపురం ఉంది. లోపల విశామైలన ప్రాంగణంలో నవగ్రహాలను, శ్రీరాముని, ఆంజనేయ స్వామి ఉపాలయాలను దర్శించవచ్చు. ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. క్రింది భాగాన జనార్థనస్వామి, పైభాగాన అన్నపూర్ణమ్మ అమ్మవారి ఆలయం కలదు.
విశాలమైన ఈ ఆలయ ప్రాంగణంలో వివాహాలు జరుపుకోవచ్చు
దర్శన వేళలు
ఉదయం గం॥ 05-00 నుండి మధ్యాహ్నం గం॥ 12-00 వరకు మరియు సాయంత్రం గం॥ 04-00 నుండి రాత్రి గం॥08-30 ని॥ వరకు
ప్రత్యేక పూజా వివరాలు :
మహాన్యాసక పూరక అభిషేకాలు : ఉదయం గం॥ 05-10 వరకు రూ.50-
అమ్మవారికి కుంకుమ పూజ - సహస్రనామార్చన : రూ.10-
వార్షిక అభిషేకం - గోత్రనామాలతో సంవత్సకాలం : రూ.501-
శాశ్వత అభిషేకం : రూ.3,116-
నవరాత్రులో అమ్మవారికి 9 రోజు పాటు పూజు : రూ.150-
కార్తీకమాసం నెలరోజు పాటు పూజలు : రూ.250-
లక్ష పత్రి పూజ : రూ.516-
లక్ష కుంకుమపూజ. : రూ.216-
స్వామి వారి కళ్యాణం : రూ.300-
మహాశివరాత్రికి స్వామివారి కళ్యాణం 5 రోజుల పాటు జరుగును కళ్యాణం, రధోత్సవం, తెప్పోత్సవం జరుతాయి
ఎలా వెళ్ళాలి ? : పశ్చిమ గోదావరి జిల్లాలోని, భీమవరానికి విజయవాడ నుండి రైలు, రోడ్డు మార్గాలలో వెళ్ళవచ్చు. రైలు ద్వారా వెళ్ళేవారు టౌన్ రైల్వే స్టేషన్ లేక జంక్షన్ స్టేషన్‌లో దిగి అర కిలోమీటరు దూరంలో ఉన్న గుడికి (గునుపూడి గ్రామం) వెళ్ళవచ్చు. బస్ స్టాండ్‌నుండి నడచి వెళ్ళవచ్చును.