ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధి పొందిన ఐదు శైవక్షేత్రాలను పంచారామాలంటారు. ఒక్కో పంచారామానికి ఒక్కో కథనం ఉంది. స్కంధపురాణంలో పంచారామాల గురించి వివరించబడింది.పూర్వం తారాకాసురుడనే రాక్షసుడు శివుని గురించి ఘోరతపస్సు చేసి శివుని ఆత్మలింగాన్ని వరంగా పొంది మెడలో ధరిస్తాడు. వరగర్వంతో దేవతలను అనేక బాధకు గురిచేయగా దేవతలంతా విష్ణుమూర్తిని ప్రార్ధిస్తారు. శివపార్వతులకు కలిగే కుమారుని చేతిలో తారకాసురునికి మరణం ఉందని విష్ణుమూర్తి సెలవిస్తాడు.
దేవతలంతా శివపార్వతులు రెండవ పుత్రుడైన కుమారస్వామి నాయకత్వంలో తారకాసురుని మీదకు యుద్ధానికి వెళతారు. ఆయుద్ధంలో కుమారస్వామి తారకాసురుని మెడలో ఉన్న ఆత్మలింగాన్ని ఐదు భాగాలుగా ఖండించి తారకాసురుని వధిస్తాడు. కుమారస్వామిచే ఐదుభాగాలుగా ఛేదించబడిన ఆత్మలింగం ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రదేశాలలో పడుతుంది. ఆ ఐదు భాగాలు వివిధ దేవతలచే ప్రతిష్టించబడతాయి. వీటినే పంచారామాలు అంటారు.
శ్రీరాముడు సీతమ్మవార్ల చేతుల మీదుగా ప్రతిష్టితమైన క్షీరలింగేశ్వరస్వామి ఆలయం క్షీరారామం.ఈ దేవాలయం క్రీ॥శ॥ 10-11 శతాబ్ధాల మధ్య చాళుక్యు రాజులచే నిర్మించబడినది. ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తున ఉంటుంది
పంచారామ క్షేత్రాలో ఒకటైన సోమారామం (శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామివార్ల దేవస్థానం) భీమవరం పట్టణం గునుపూడి గ్రామంలో ఉన్నది. ఇక్కడ స్వామివారిని సోమేశ్వరుడని పిలుస్తారు. ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉన్నది
ఈ పవిత్ర క్షేత్రం పంచారామాలలో మెదటిది. మరియు త్రిలింగ క్షేత్రాలలో ఒకటి ద్రాక్షారామం(తూర్పుగోదావరి). దక్షప్రజాపతి యజ్ఞం చేసిన పుణ్యస్థలం మరియు పార్వతీదేవి జన్మస్థలం. సూర్యుడు ఏ విధంగా ప్రకాశిస్తాడో అలాగే
చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, కళాత్మకంగా ఎంతో విశిష్టిత కలిగిన పుణ్యక్షేత్రమిది.చాళుక్య భీమ మహారాజు (క్రీ॥శ 872-921) నిర్మించడం వలనే ఈ క్షేత్రానికి భీమేశ్వరాలయం అనిపేరు వచ్చింది. 13 అడుగు శివలింగాన్ని దర్శించుకుంటున్నప్పుడు
అమరారామం లేక అమరావతి చారిత్రక ప్రసిద్ధిచెందిన శైవ పుణ్యక్షేత్రం. గుంటూరు జిల్లా కేంద్రం గుంటూరుకు 35 కి.మీ. దూరంలో కృష్ణానది తీరంలో ఉన్నది. ఇక్కడి స్వామివారు అమరేశ్వరుడు. అమ్మవారు బాలచాముండి.