శ్రీకూర్మం దేవాలయం శ్రీకాకుళం జిల్లా గార మండలంలో శ్రీ కూర్మం అనే గ్రామంలో ఉన్నది . ఇచ్చట దైవం శ్రీకూర్మనాథుడు.
శ్రీ మహావిఫ్ణువు కూర్మనాథుని రూపంలో ఇక్కడ పూజింపబడతాడు. కూర్మావతారానికి ఉన్న గుడి ఇది ఒక్కటే
ఇక్కడ స్వామివారు పడమట ముఖంగా ఉంటాడు. శ్రీకాకుళ పట్టణంనుండి 15 కి.మీ. దూరంలో శ్రీకూర్మనాథుని క్షేత్రం కలదు. శ్రీకాకుళపట్టణంలోని పాత బస్‌స్టాండ్ నుండి ప్రతి 15 నిమిషములకు అరసవల్లి మీదుగా (శ్రీ సూర్యనారాయణ దేవాలయం) ఆర్టీసీ వారు బస్సులు నడుపుచున్నారు. భారతదేశంలోనే కూర్మావతారం గల దేవాలయం ఇదొక్కటే. ఇక్కడ మనం శ్రీరామానుజాచార్యు, శ్రీ వరదరాజస్వామి, శ్రీ మధ్యాచార్యులు, కోదండరామస్వామి ఆలయాలను కూడా దర్శించవచ్చు.