header

Ainavilli Vigneswara Swamy…Inavilli…శ్రీవిఘ్నేశ్వరస్వామి దేవాలయం

Ainavilli vinayaka temple శ్రీవిఘ్నేశ్వరస్వామి దేవాలయం తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి ( గ్రామం మరియు మండంలో ) ఉంది. కొబ్బరి చెట్లు, చల్లటి గాలులు, పచ్చటి పొలాలతో వాతావరణం ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది.
స్థలపురాణం స్థలపురాణం గురించి రెండు కధనాలున్నాయి. ఒకటి దక్షప్రజాపతి యజ్ఞాన్ని ప్రారంభించేముందు ఇక్కడ వినాయక పూజ చేశాడని ఒక కథనం. మరొక కథనం వ్యాసమహర్షి దక్షిణ భారతదేశ యాత్ర చేయు సమయంలో ఇక్కడ వినాయకుడ్ని ప్రతిష్టించారని చెబుతారు. కృతయుగం నుండి ఉన్నట్లు చెప్పబడుతున్న ఈ ఆలయంలో గణేశుడు స్వయంభువు. పూర్వ ఐనవిల్లిలో శ్రీగణపతి మహాయజ్ఞం జరుగుతుండగా గణేషుడు ప్రత్యక్షమై అక్కడి వారిని ఆశీర్వదించాడని 14వ శతాబ్ధంలో శ్రీ శంకరభట్టువారు వ్రాసిన శ్రీపాద శ్రీవల్లభచరిత్రలో పేర్కొనబడింది. అదే సమయంలో వినాయకుని హేళన చేసిన ముగ్గురు వ్యక్తులు తరువాత మూగ, చెవిటి, గుడ్డివారిగా పుట్టి కాణిపాకంలో వినాయకుని ఆవిర్భావం గుర్తించి మూగ, చెవిటి, గుడ్డి నుండి విముక్తులయ్యారని స్థలపురాణం.
ఇక్కడ వినాయకుడు దక్షిణాభిముఖుడై ఉంటారు. దేవాలయం ఎత్తయిన రెండు ప్రాకాలరాతో, సింహద్వారాలతో చూపరులకు భక్తిపారవశ్వం కలుగ చేస్తుంది. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన గణపతి దేవాలయం ఇది. ఈ ఆలయం సముదాయంలో ఇంకా అనేక ఆలయాలున్నవి. అన్నపూర్ణాదేవి ఆలయం, విశ్వేశ్వరాలయం, కాభైరవ ఆలయం, శ్రీ భూ సమేత కేశవస్వామి ఆలయం మొదలగునవి. క్షేత్రపాలకుడైన కాభైరవస్వామి ఆలయం కూడా ప్రధాన ఆలయ ప్రాంగణంలో ఉంది. అతిపురాతనమైన ఈ ఆలయాన్ని దేవతలే నిర్మించారని భక్తుల విశ్వాసం. ఈ స్వామిని అర్చిస్తే కోర్కెతోపాటు బుద్ధి వికసిస్తుందని భక్తుల విశ్వాసం.
ఉత్సవాలు కృష్ణాష్టమి రోజున గ్రామోత్సవం నిర్వహిస్తారు. గ్రామస్తులతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల వారు గ్రామోత్సవాన్ని చూడటానికి వస్తారు. వినాయకచవితి, గణపతి నవరాత్రులు వైభవంగా జరుగుతాయి. సంక్రాంతి రోజున ప్రభ ఉత్సవాన్ని జరుపుతారు
వసతి సౌకర్యం : అయిన విల్లిలో వసతి సౌకర్యం లేదు. కాకినాడ, రాజమండ్రి, యానంలలో బస చేయవచ్చు.
ఎలా వెళ్లాలి ? తూర్పు గోదావరిలో ఉన్న ఈ ఆలయానికి విజయవాడ నుండి వెళ్ళేవారు రాజమండ్రి నుండి వెళ్ళవచ్చు. మరియు విశాఖ నుండి వచ్చే వారు కాకినాడ నుండి వెళ్ళవచ్చు. కాకినాడ నుండి 3 దారులు కలవు. కాకినాడ-ద్రాక్షరామం-కోటిపల్లి-ముక్తేశ్వరం మీదుగా 45 కి.
కాకినాడ-యానం-అమలాపురం-ముక్తేశ్వరం మీదుగా మీదుగా 65 కి.మీ.
కాకినాడ-యానం-ముమ్మిడవరం-ముక్తేశ్వరం మీదుగా 45 కి.మీ. దూరంలో అయినవిల్లి దేవాలయం ఉన్నది.
ఇతరవివరాలకు ఈ క్రింది ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు లేదా ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి: http://www.ainavillivighneswara.com/ ఫోన్‌ : 08856-225812