header

Kanipakam Sri Varasiddi Vinayaka Temple / కాణిపాకం- శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం

స్వామివారి ప్రత్యేక పూజలు
సుప్రభాతం మరియు బిందుతీర్థాభిషేకం
ఉ. గం.4.00 నుండి 5.05. ని.ల వరకు
రూ.600/- ఒక్కరు గాని దంపతులను (భార్య, భర్త) అనుమతిస్తారు. పాల్గొన్న వారికి 5 లడ్డూలు, ఒకటిన్నర కేజీల పులిహోర, ఒక స్వామివారి శేషవస్త్రం, వెండి డాలరు ఇస్తారు. ఇది స్వామి వారి సుప్రభాత దర్శనం మరియు మేలుకొలుపులతో కూడిన దర్శనం.
ప్రత్యేక అభిషేకాలు :
ఉ.గం.5.30 నుండి 6.00 గం.ల వరకు, ఉ. గం.9.00 నుండి 10 గంట|ల వరకు, గం.11.00 నుండి 12 గం.ల వరకు నిజరూప దర్శనం ఉ.5.00 నుండి 5.30 గంటల వరకు ఉ.7.00 నుండి 7.30 గంటల వరకు ఉ.8.30 నుండి 9.00 గంటల వరకు ఉ.10.30 నుండి 11.00 గంటల వరకు సా.4.30 నుండి 5.00 గంటలవరకు
గణపతి హోమం ఉ.గం. 9- 00 మ. 12.00 మధ్యలో రూ.500/-
గణపతి మోదక పూజ మ.12.00 గంటల ముందు రూ.300/- దేవస్థానంవారే పూజాసామాగ్రి సమకూరుస్తారు.
పాలాభిషేకం సా.5.45 ని.నుండి 6.15 ని.ల వరకు
గణపతి సహస్రనామార్చన ఉ.10.00 నుండి 11.00 గంటల వరకు మ.01.00 నుండి 01.30 గంటల వరకు సా.3.30 నుండి 4 వరకు సా. 6 నుండి 6.30 వరకు రూ.150/-
గణపతి పత్రపూజ మ.12.00 గంటలకు ముందు రూ.58/-దేవస్థానంవారే పూజాసామాగ్రి సమకూరుస్తారు.
షోడశగణపతి పూజ మ.12.00 గంటలకు ముందు రూ.500/- దేవస్థానంవారే పూజాసామాగ్రి సమకూరుస్తారు.
సంకటహర గణపతి వ్రతం మ.12-00 గం.లకు ముందు రూ.151/- రెండు లడ్డూలు ఇవ్వబడును
మూల మంత్రార్చన మ.12.00 గంటలకు ముందు రూ.300/-
మహా హారతి(కుంభ హారతి) ప్రతి రోజూ సా.6 గం.నుండి 6-15 ని.ల వరకు
పూలంగిసేవ ప్రతి గురువారం రూ.1000/- (ఒక కుటుంబం పాల్గొనవచ్చును)
నవగ్రహ శాంతి రూ.116/- ఒక్కొక్కరికి
పవళింపు సేవ లేక ఏకాంతసేవ రాత్రి గం.9.30 ని.ల నుండి రూ.150/- ఇద్దరికి ప్రవేశం. భక్తులే పూజాసామాగ్రి సమకూర్చుకోవాలి.
నిత్యకళ్యాణోత్సవం ఉ. 11.00 గంల నుండి 12 వరకు రూ.616/-
ఒక్కరుగాని దంపతులు గాని పాల్గొనవచ్చును. భక్తులకు స్వామివారి శేష వస్త్రం, 1 జాకెట్టు, 2 లడ్డూలు, 2 వడలు ఇవ్వబడును.
ఉంజలసేవ సా గం.6.30 నుండి 7-30 వరకు రూ.250/- ఒక్కరుగాని దంపతులు గాని పాల్గొనవచ్చును. భక్తులకు స్వామివారి శేష వస్త్రం, 1 జాకెట్టు, 2 లడ్డూలు, 2 వడలు ఇవ్వబడును.
మహా హారతి(కుంభ హారతి) ప్రతి రోజూ సా.6 గం.నుండి 6-15 ని.ల వరకు
పవళింపు సేవ లేక ఏకాంతసేవ రాత్రి గం.9.30 ని.ల నుండి
నిత్యకళ్యాణోత్సవం ఉ. 11.00 గంల నుండి 12 వరకు
ఉంజలసేవ సా గం.6.30 నుండి 7-30 వరకు
ప్రత్యేక దర్శనం రూ.10/- ఒక్కరికి
అక్షరాభ్యాసం రూ.116/-
అన్నప్రాసన రూ.116/-
బాలసారె రూ.116/-
ఉత్సవమూర్తుల హారతి రూ.2/-
ఉత్సవమూర్తుల అర్చన రూ.5/-
శుభకార్యముల ఆహ్వానపూజలు రూ.51/-
శనిదోష నివారణ సేవ రూ.5/-
వాహన పూజ రూ.50/- (ఆో, స్కూటర్‌) రూ.125/- కారు, జీపులు రూ.150/- (లారీ, బస్సులు )
వివాహ కట్టడి రూ.540/-
తల నీలాలు రూ.5/- (స్వామివారి కళ్యాణకట్ట దగ్గర)
ప్రమాణం రూ.516/- సా. 5.00 గం.లకు
శాశ్వత పూజల వివరాలు
శాశ్వత కళ్యాణోత్సవం : రూ.15,116/-
శాశ్వత ఉంజలసేవ : రూ.7,500/-
శాశ్వత అభిషేకం : రూ.7,500/-
శాశ్వత గణపతి హోమం : రూ.7,500/-
శాశ్వత పూజ : రూ.1516/-
శాశ్వత నిత్యార్చన : రూ.1516/-
శాశ్వత ప్రసాదం : రూ.1116/-
ఈ ధరలు కాలానుగుణంగా మారుతుండవచ్చు. వివరాలకు ఈ క్రింది నంబర్లకు ఫోన్ చేసి అడగవచ్చు.
91-8573-281540 (office)
91-8573-281747 (EO)
91-8573-281547 (PA)
దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు
మణికంఠేశ్వరస్వామి ఆలయంలో ప్రతి గురువారం దక్షిణామూర్తికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక అభిషేకం, అర్చనలు చేస్తారు. సర్పదోష పరిహారార్థం.. వరదరాజస్వామి ఆలయ నిర్మాణం
గణనాథుని ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి పురాణాల్లో ఓ కథ ప్రచారంలో ఉంది. జనమేజయ మహారాజు చేపట్టిన సర్పయాగ దోష పరిహారానికిగానూ శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు ఇక్కడ వరదరాజస్వామి ఆలయం నిర్మితమైనట్టు చెబుతారు. ఆలయంలోని మూలవిరాట్ ఆకారంలో సుందరశిల్ప కౌశల్యం ఉట్టిపడుతుంది. ఆలయంలో నిత్యం సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహిస్తుంటారు.
పంచామృతాభిషేకం టిక్కెట్ ధర: రూ. 550
స్వామివారిని పంచామృతాలతో అభిషేకం చేయడం పుణ్యఫలం
గణపతి హోమం టిక్కెట్ ధర: 500
‘కలౌ చండీ వినాయకః’ అంటే ఈ కలియుగమున పిలవగానే పలికే దేవతలు.. చండి(దుర్గా), గణపతి. మన దైనందిన జీవితంలో ఎన్నో విఘ్నాలు, ప్రతి పనికి పోటీ, ఏదో ఒక ఆటంకం జరగవచ్చు. అన్ని విఘ్నాలను అధిగమించాలి. అంటే గణపతిని అగ్నియుక్తంగా పూజించాలి. స్వామివారి సన్నిధిలో గణపతి హోమం చేసుకోవడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
గణపతి మోదకపూజ టిక్కెట్ ధర: 300
గణపతి పురాణంలో సహస్రనామాల్లో ‘మోదక ప్రియాయనమః’ అని ఉంది. మోదకం అంటే కుడుములు అని అర్థం. హిందువులు ఏ శుభకార్యం చేయాలన్న ముందుగా వినాయకుడికి కుడుములు నైవేద్యంగా సమర్పిస్తారు.
సహస్ర నామార్చన, వ్రతపూజ టిక్కెట్ ధర: రూ. 150, రూ. 58
‘కలౌ గణేశ’ స్మరణామున్ముక్తి అన్న నానుడిని అనుసరించి స్వామివారికి 1008 నామాలు అర్పించడం వల్ల విశేషఫలం కలుగుతుంటారు.
మూల మంత్రార్చన టిక్కెట్ ధర: రూ. 300
నారికేళ పూజ
వినాయకుని గణాధిపతిగా నియమించిన తర్వాత.. అక్కడ విష్ణుమూర్తి దర్శనమిచ్చారు. వినాయకుడు విష్ణువు చేతిలోని సుదర్శన చక్రాన్ని తీసుకున్నాడు. విష్ణువు అడిగినా తిరిగి ఇవ్వలేదు. దీనికి బదులుగా ఏదైనా వరం కోరుకొమ్మని విష్ణుమూర్తి అంటే త్రినేత్రములు గల శిరస్సు కావాలని గణపతి కోరతాడు. అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుని సహాయంతో నారికేళాన్ని సృష్టించి ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే గణపతిని అవాహనం చేసి నారికేళంతో పూజిస్తారు.
సంకటహర గణపతి వ్రతం టిక్కెట్ ధర: రూ. 151
గణేశ పురానంలో ఈ వ్రతానికి విశేష స్థానం కల్పించారు. దీన్ని శ్రీ కృష్ణుడు, బ్రహ్మదేవుడు తదితరులు ఆచరించారు. సంతానం, వ్యాపార అభివృద్ధి, సకల విఘ్నాలు తొలగడం, ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో జయం కలగడానికి దీన్ని ఆచరిస్తారు.
పూలంగి సేవ టిక్కెట్ ధర: రూ. 1,000
వివిధ రకాలైన పుష్పాలను గర్భాలయం, అంత్రాలయం, అర్ధమండపం, స్వామివారికి విశేష పుష్పాలకంరణ చేస్తారు. రంగుల పుష్పాలతో స్వామివారిని పూజిస్తారు
అక్షరాభ్యాసం టిక్కెట్ ధర: రూ. 116
వినాయకుడి ఆలయం వద్ద అక్షరాభ్యాసం చేసుకుంటే పిల్లల విద్యాభ్యాసం సక్రమంగా సాగుతుందని భక్తుల నమ్మకం. ఆలయంలో నిత్యం అక్షరాభ్యాసం జరుగుతుంటుంది.
అన్నప్రాసన టిక్కెట్ ధర: రూ.116
పిల్లలకు అన్నప్రాసనం, విశిష్ఠరోజున చేస్తారు. విఘ్నాలను తొలగించే వినాయకుని ఆలయంలో అన్నప్రాసన చేయడం శుభం. ఇక్కడ అన్నప్రాసన చేయడం వల్ల పిల్లలకు జీవితంలో మంచి జరుగుతుంది. మొదటి పూజలు అందుకునే వినాయకుడి ఆలయంలో అన్నప్రాసన చేస్తే మంచిదని పురాణాలు చెబుతున్నాయి.
వివాహ ఆహ్వానపత్రికలకు పూజలు టిక్కెట్ ధర: రూ. 51-
వివాహం చేసుకునే నూతన జంటలకు సంసార జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు జరగకుండా ఉండాలని వినాయకుని చెంత మొదటి వివాహ పత్రికను ఉంచి పూజలు చేస్తే విఘ్నాలు తొలగుతాయాని భక్తుల విశ్వాసం.
కాణిపాకం ఆలయం ఉదయం 04-00 నుండి రాత్రి 09-00 గంటల వరకు తెరచి ఉంటుంది. ఇంకా ఇతర వివరాలకు ఈ క్రింది నంబర్లకు ఫోన్ చేయండి
91-8573-281540 (office)
91-8573-281747 (EO)
91-8573-281547 (PA)