telugu kiranam

Pulicate Lake / పులికాట్‌ సరస్సు

Pulicate Lake / పులికాట్‌ సరస్సు
ఆంధ్రప్రదేశ్‌లో సహజసిద్ధంగా ఏర్పడ్డ ఉప్పునీటి సరస్సు పులికాట్‌. ఇది ఆంధ్ర తమిళనాడు సరిహద్దులలో వ్యాపించి ఉన్నది. పులికాట్‌ విస్తీర్ణం 600 చ.కి.మీ. నెల్లూరు జిల్లా వాకాడు, చిట్టమూరు, సూళ్ళూరుపేట, దొరవారిసత్రం మండలాలతోపాటు తమిళనాడు పరిధిలో కూడా వ్యాపించి ఉన్నది. పులికాట్‌ సరస్సు విదేశీ పక్షుల ఆవాసం. పక్షులకు ఆహారం పుష్కలంగా దొరుకుతుంది.
పులికాట్‌ సరస్సు 1976లో పక్షుల రక్షిత కేంద్రంగా గుర్తింపు పొందింది. ప్రతి సంవత్సరం అక్టోబరు నుండి మార్చి దాకా దేశ విదేశాలనుండి సుమారు 50 రకాల పక్షుల దాకా వస్తాయి. రాజస్తాన్‌లోని రాన్‌ ఆఫ్‌ కచ్‌ నుండి ఫ్లెమింగో పక్షులు వస్తాయి. సైబీరియా మరియు నైజీరియా నుండి గూడబాతులు (పెలికాన్‌) వస్తాయి. నేలపట్టులో నివాసం ఏర్పరచుకొని పులికాట్‌కు ఆహారం కోసం వస్తాయి.
పక్షులకు సంబంధించిన గ్రంధాలయం, ఆడిటోరియం, మ్యూజియం కూడా ఉన్నాయి. పక్షులను చూడటానికి వాచ్‌ టవర్స్‌ కూడా ఉన్నాయి.
పులికాట్‌ సరస్సులలో వేటవలన 10వే మంది మత్సకారులు జీవనం సాగిస్తున్నారు. సరస్సు మధ్యలో ఇరకం దీవి అనే గ్రామం ఉంది. ఇది మంచి టూరిస్టు కేంద్రం. కాని ఇక్కడకు వెళ్ళాంటే భీమునివారి పాలెం నుండి పడవలలో వెళ్ళాలి.