కొల్లేరు సరస్సు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సహజమైన మంచినీటి సరస్సు కొల్లేరు. కృష్ణా మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో 77,138 ఎకరాలలో విస్తరించి ఉన్నది.
కృష్ణా జిల్లాలో కైకలూరు, మండవల్లి మండలాలో 12 వేల ఎకరాలో విస్తరించి ఉన్నది. తమ్మిలేరు, బుడమేరు, ఎర్రవాగు వంటి చిన్న చిన్న నదులు ఇందులో కలుస్తాయి.
ఆంధ్రప్రదేశ్లో సహజసిద్ధంగా ఏర్పడ్డ ఉప్పునీటి సరస్సు పులికాట్. ఇది ఆంధ్ర తమిళనాడు సరిహద్దులలో వ్యాపించి ఉన్నది. పులికాట్ విస్తీర్ణం 600 చ.కి.మీ. నెల్లూరు జిల్లా వాకాడు, చిట్టమూరు, సూళ్ళూరుపేట, దొరవారిసత్రం మండలాలతోపాటు తమిళనాడు పరిధిలో కూడా వ్యాపించి ఉన్నది. పులికాట్ సరస్సు విదేశీ పక్షుల ఆవాసం. పక్షులకు ఆహారం పుష్కలంగా దొరుకుతుంది.
వీరాపురంలో 188 ఎకరాల విస్తీర్ణంలో పురాతనమైన చెరువు ఒకటుంది. దీని కింద 80 ఎకరాల ఆయకట్టుంది. దీని చుట్టూ వందలాది చెట్లుండటంతో ఎన్నో ఏళ్లుగా సైబీరియా నుంచి వేలాది కొంగ జాతి పక్షుల వలసొస్తున్నాయి. వీటిని స్థానికులంతా ప్రేమగా ఎర్రమూతి కొంగలంటారు.
మన రాష్ట్రంలో న్లెల్లూరు జిల్లా సూళ్ళూరుపేటకి కేవలం 15 కి.మీ దూరంలోని నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం ఉంది.
సువిశాలమైన కొలను....దానిలోపల ఒడ్డున రకరకాల చెట్లు...వాటినిండా విరబూసినట్లున్న రంగురంగుల పక్షులు...
గుంటూరు జిల్లా ఉప్పలపాడు గ్రామంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ పక్షుల కేంద్రం ఉంది. ఇక్కడికి 14 జాతుల పక్షుల వస్తాయి. ఖండాంతరాల నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి గుడ్లు పెడతాయి. ప్లిల్లల్ని పొదిగి మళ్లీ సొంత ప్రాంతానికి వెళ్లిపోతాయి.
తెలినీలాపురం మరియు తేలుకుంచి పక్షుల సంరక్షణా కేంద్రాలు ఆంధ్రప్రభుత్వం వారిచే నిర్వహించ బడుచున్న పక్షుల కేంద్రం. తెలినీలాపురం పక్షుల కేంద్రం శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండంలో (తెలినీలాపురం గ్రామం) ఉన్నది.
తెలుగు రాష్ట్రాల్లోకి వలస పక్షులు సాధారణంగా అక్టోబరు మాసాంతంలో వస్తుంటాయి. కానీ, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామానికి మృగశిర కార్తె సమయంలోనే వచ్చేస్తాయి.
Kolleru Lake / కొల్లేరు సరస్సు (కృష్ణా, పశ్చిమ గోదావరి)
Pulicate Lake / పులికాట్ సరస్సు
Veerapuram Bird Sanctuary / కొంగజాతి పక్షుల కేంద్రం వీరాపురం
Nelapattu Bird Sanctuary / నేలపట్టు పక్షుల విహారకేంద్రం
Uppalapadu Bird Sanctuary / ఆహ్లాద భరితం ఉప్పపాడు పక్షుల విడిది కేంద్రం
Telineelapuram Bird Sanctuary / తెలినీలాపురం..
Birds-Sanctuary-Punyakshetram……పుణ్యక్షేత్రం, తూర్పుగోదావరి