తెలినీలాపురం మరియు తేలుకుంచి పక్షుల సంరక్షణా కేంద్రాలు ఆంధ్రప్రభుత్వం వారిచే నిర్వహించ బడుచున్న పక్షుల కేంద్రం. తెలినీలాపురం పక్షుల కేంద్రం శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండంలో (తెలినీలాపురం గ్రామం) ఉన్నది. శ్రీకాకుళానికి 65 కి.మీ దూరంలో ఉన్నది. తేలుకుంచి శ్రీకాకుళానికి 115 కి.మీ. దూరంలో ఇచ్ఛాపురం మండలంలో ఉన్నది. ప్రతి సంవత్సరం సైబీరియా నుండి షుమారు 3,000 పెలికాన్స్ మరియు పెయింటెడ్ స్టార్క్స్ (ఒక రకమైన కొంగలు) వస్తాయి. సెప్టెంబర్ నెలలో ఇక్కడకు వచ్చి మార్చి నెలలో తిరిగి వెళతాయి.
ఆంధ్రా యూనివర్శిటీ వారి పరిశోధన మేరకు 15 సంవత్సరాల క్రితం ఇక్కడకు 10,000కు పైగా పక్షులు వలస వచ్చేవని తెలుస్తుంది. ప్రస్తుతం 3,000 పక్షుల దాకా మాత్రమే వస్తున్నవి.
ఎలావెళ్ళాలి ?
శ్రీకాకుళం నౌపాడా రైల్వేస్టేషన్ నుండి షుమారు 3 కి.మీ. దూరంలో తెలినీలాపురం ఉంది. నౌపాడా నుండి ఆటోలలో వెళ్ళవచ్చు. బస్సు మార్గంలో విశాఖపట్నం నుండి టెక్కలికి వెళ్ళి అక్కడనుండి ఆటోలలో వెళ్ళవచ్చు.