వీరాపురంలో 188 ఎకరాల విస్తీర్ణంలో పురాతనమైన చెరువు ఒకటుంది. దీని కింద 80 ఎకరాల ఆయకట్టుంది. దీని చుట్టూ వందలాది చెట్లుండటంతో ఎన్నో ఏళ్లుగా సైబీరియా నుంచి వేలాది కొంగ జాతి పక్షుల వలసొస్తున్నాయి. వీటిని స్థానికులంతా ప్రేమగా ఎర్రమూతి కొంగలంటారు.
\ఫిబ్రవరి నుంచి సైబీరియాలో చలికాం మొదలవుతుంది. దీంతో వేడిని వెతుక్కుంటూ ఇవి వీరాపురానికి వచ్చి ఇక్కడే సంతానకార్యక్రమం పూర్తి చేసుకొని, ఆగస్టు తరువాత తిరిగి వెళ్లిపోతాయి. ఈ కాలంలో ఇవి స్థానిక చెరువులోని చేపలతో పాటు ఆహారం కోసం చుట్టుపక్కల కొన్ని వందల కిలోమీటర్లు వెళ్లి తిరిగి పొద్దుగూకే సమయానికి తిరిగొస్తాయి. కొన్ని ఏళ్లుగా ఇవి గ్రామంతో మమేకమైపోయాయి. దీంతో గ్రామంలోని కొన్ని కుటుంబాల వారు వీటి కోసం ప్రత్యేకంగా ఆహారం తయారు చేయించి మరీ వేస్తున్నారు.
సీజన్‌లో పక్షులను చూసేందుకు వచ్చే పర్యాటకులతో ఈ ఊరొక మినీ పర్యాటక కేంద్రంగా వర్థిల్లుతుంది. ఈ చెరువును చారిత్రక సంపదగా ప్రకటించారు. చెరువు క్రింద 86 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు నీటితో సాగుచేస్తే చెరువులో నీరు తగ్గిపోయి మత్ససంపద అంతరించి ఎక్కడ పక్షులు రాకుండా పోతాయోనన్న సృహతో గ్రామస్తులు ఈ చెరువు నీటితో సాగును నిలిపివేశారు.
ఎలా వెళ్లాలి : నెల్లూరు మరియు చెన్నై నుండి వెళ్ళవచ్చు. దూరం సుమారు 80 కి.మీ.