header

Atlantic Ocean ... అట్లాంటిక్ సముద్రం

భూమి మీద ఉన్న సముద్రాలలో అట్లాంటిక్ సముద్రం రెండవది. ఈ సముద్రం యూరోప్ మరియు ఆఫ్రికా ఖంఢాలను ఉత్తర మరియు దక్షిణ అమెరికా ఖంఢాలనుండి వేరు చేస్తుంది. ఈ సముద్రానికి ఈ పేరు గ్రీకులు వలన వచ్చింది అట్లాంటిక్ అనే గ్రీకు రాక్షసుని పేరు ఈ సముద్రానికి పెట్టారు.
మొత్తం భూభాగంలో 20 శాతం అట్లాంటిక్ సముద్రమే.10,64,00,000 చ.కి మీటర్ల భూభాగాన్ని ఆక్రమించింది ఈ సముద్రం.
భూమి మీద ఉన్న అయిదు మహాసముద్రాలలో అట్లాంటిక్ సముద్రం చివరిగా ఏర్పడిన దంటారు. కొలంబస్ అట్లాంటిక్ మహాసముద్రం మీద పయనించే అమెరికా ఉనికిని కనుగొన్నాడు. నౌకలు, విమానాలు అనూహ్యంగా అదృశ్వమవుతున్న ప్రాంతం బెర్మూడా ట్రయాంగిల్ ఈ సముద్రంలోనిదే.
అట్లాంటిక్ మహాసముద్రంలో పెట్రోల్ మరియి గ్యాస్ ఉన్న ప్రాంతాలు చాలా ఉన్నాయి. విలువైన రాళ్లు ఈ సముద్రతీరంలో ఉన్నాయి. అనేక రకాల చేపలు ఈ సముద్రంలో లభిస్తాయి.
పురాతన కాలానికి చెందిన మమ్మల్స్ (క్షీరదాలు) తిమింగలాలు, సీల్స్, సముద్రపు తాబేళ్లు, డాల్ఫిన్లు, సముద్రపు సింహాలు ఈ సముద్రంలో ఉన్నాయి.
పారిశ్రామిక కాలుష్యం, నగరాల వచ్చే చెత్త, ఆయిల్ వలన ఈ సముద్రం కాలుష్యం బారిన పడింది.