భూమీ మీద మొత్తం ఐదు మహా సముద్రాలు ఉన్నాయి. అవి పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, సదరన్ మహాసముద్రం (పసిఫిక్ సముద్రాన్ని నార్త్ (ఉత్తర), సౌత్ (దక్షిణ) భాగాలుగా పిలుస్తారు) అలాగే అట్లాంటిక్ సముద్రాన్ని కూడా ఉత్తర, దక్షిణ అట్లాంటిక్ సముద్ర భాగాలుగా పిలుస్తారు. ఈ లెక్క ప్రకారం మొత్తం ఏడు సముద్రాలుగా పరిగణిస్తారు కానీ భూమిమీద మహాసముద్రాలు మొత్తం ఐదే. భూమి మీద ఉన్న ముఖ్యమైన మహాసముద్రాలు ఇవే. హిందూ మహాసముద్రానికి ఈశాన్య భాగంలో ఉన్న భాగాన్ని బంగాళా ఖాతం (Bay of Bengal) అని పిలుస్తారు(భారత దేశానికి తూర్పున బంగాళాఖాతం ఉన్నది). బంగాళాఖాతం అని ప్రత్యేకమైన సముద్రం లేదు. నిజానికి సముద్రాలు(Seas) వేరు మహా సముద్రాలు (Oceans) వేరు. సముద్రాలు(Seas) మహాసముద్రాల (Oceans) కన్నా వైశాల్యంలో చిన్నవి. చిన్న సముద్రాలు అనేకం ఉన్నాయి. అవి మెడిటేరియన్ సముద్రం, నల్ల సముద్రం, ఎర్రసముద్రం, మృతసముద్రం, కరేబియన్ సముద్రం ఇంకా అనేకం ఉన్నాయి. ఐదు సముద్రాల వివరాల కోసం కింద ఇచ్చిన లింక్ లపై క్లిక్ చేయండి. Next Page .మిగతా భాగం...తరువాత పేజీలో..