header

Hindu Ocean…హిందూ మహాసముద్రం

భూమి మీద ఉన్న సముద్రాలలో హిందూమహా సముద్రం వైశాల్యంలో మూడవ స్థానంలో ఉంది. 7,05,60,000 చ.కి.మీ భూభాగాన్ని ఈ సముద్రం ఆక్రమించి ఉన్నది. దక్షిణ ఆసియా మరియు మరియు ఇండియా దేశాలు ఈ సముద్రం ఒడ్డునే ఉన్నాయి. తూర్పు ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా ఖంఢాలను వేరుచేస్తుంది. ఎండాకాలంలో ఈ సముద్రంలో తుఫాన్లు ఎక్కువగా వస్తాయి. అన్ని సమద్రాలకంటే వెచ్చని సముద్రమని పేరు.
భారతదేశం (హిందూ దేశం) పేరుమీదుగా ఈ సముద్రానికి హిందూ మహాసముద్రం అని పేరు వచ్చింది. మడగాస్కర్ ఈ సముద్రంలోని పెద్ద దీవులలో ఒకటి. శ్రీలంక, షీచెల్లాస్. కొమోరోస్, మాల్దీవులు, మారిషస్ ఇతర దీవులు ఈ సముద్రంలో ఉన్నాయి. ఈ సముద్రానికి ఉన్న వెచ్చదనం వలన చేపలు కూడా పరిమితంగా లభిస్తాయి. రొయ్యల, టూనా చేపలు లభిస్తాయి.
అంతరించి పోతున్న జాతులలో తాబేళ్లు, తిమింగలాలు, డూగాంగ్ వంటివి ఉన్నాయి. హిందూ మహాసముద్రం మిగతా సముద్రాల కంటే చాలా ప్రశాంతమైన సముద్రం. హిందూమహాసముద్రంలో ఉన్న ముఖ్యమైన నౌకాశ్రయాలు కోచి, కలకత్తా, విశాఖపట్నం, చెన్నై (భారతదేశానికి చెందినవి). యెమెన్ దేశంలోని అడెన్, ఆస్ట్రేలియాలోని పెర్త్, పాకిస్తాన్ లోని కరాచీ. సముద్రంలో లభించే పెట్రోలియం ఉత్పత్తులలో 40 శాతం హిందూ మహా సముద్రం నుండే లభిస్తాయి.
హిందూ మహాసముద్రానికి ఈశాన్య భాగంలో ఉండే సముద్రప్రాంతాన్ని బంగాళా ఖాతం అని పిలుస్తారు.