
ఐదు సముద్రాలలో పసిఫిక్ సముద్రం పెద్దది. మూడోవంతు భూభాగంలో ఈ సముద్రం వ్యాపించి ఉన్నది. ఈ సముద్రం ఆసియా మరియు ఆస్ట్రేలియా ఖంఢాలను ఉత్తర మరియు దక్షిణ అమెరికా ఖంఢాల నుండి వేరుచేస్తుంది. 165.25 మిలియన్ల చ.కి.మీ భూభాగాన్ని ఈ సముద్రం ఆక్రమించింది.
ఈ సముద్రానికి ఫసిఫిక్ సముద్రం అనే పేరును Ferdinand Magellan అనే పోర్చుగీసు అన్వేషకుడు సూచించాడు. అతడు ఈ సముద్రాన్ని మార్ పసిఫికో అని పిలిచాడు. దీనికి ఫీస్ ఫుల్ (ప్రశాంతమైన సముద్రం) అని పోర్చుగీసు భాషలో అర్ధం. పసిఫిక్ మహాసముద్రానికి పశ్చిమంలో సుమారు 200 కిలోమీటర్ల దూరంలో మారియన్ ద్వీపం దగ్గర మారియానా అనే కందకం కలదు. ఇది ప్రపంచంలోనే లోతైన ప్రదేశం. 35,797 అడుగుల లోతు ఉంటుంది. పసిఫిక్ మహా సముద్రంలో న్యూ గినియా పెద్ద దీవి. Hawaiian Islands కూడా పసిఫిక్ సముద్రంలో ప్రముఖమైన దీవులు. ఆస్ట్రేలియా తీరాన గల బారియర్ రీఫ్ (సముద్రంలో ఏర్పడిన సహజమైన రాతి గుట్ట) కూడా చెప్పుకో దగినది
పెట్రోలియం, మరియు సహజవాయువులు ఈ సముద్రంలో కనుగొనబడ్డాయి.
అనేక రకాల చేపలు ముఖ్యంగా టూనా, సాల్మన్ చేపలు, హెర్నింగ్,స్వార్డ్ ఫిష్, స్నాపర్ చేపలు లభిస్తాయి.
దక్షిణ తూర్పు ఆసియా మరియు తూర్పు ఆసియా దేశాలనుండి అనేక కలుషితమై నదులు ఈ సముద్రంలో కలుస్తున్నాయి. వ్యవసాయ భూముల నుండి ఎరువులు, పురుగుల మందులు కూడా ఈ సముద్రంలోనికి చేరుతాయి. పారిశ్రామిక వ్యర్ధాలు కూడా ఈ సముద్రంలోనికి చేరటం వలన సముద్ర జీవులకు ఈ సముద్రం సురక్షితం కాదని తేలింది.