
సదరన్ సముద్రాన్నే అంటార్కిటికా సముద్రం అని, సౌత్ పోలార్ సముద్రం అని, ఆస్ట్రల్ సముద్రం అని కూడా అంటారు. ఈ సముద్రం భూగోళానికి దక్షిణ ధ్రువంలో ఉన్నది. భూభాగంలో 6 శాతం భాగాన్ని ఆక్రమించింది. సముద్రాలలో నాలుగవ అతిపెద్ద సముద్రం మరియు చిన్నవాటిలలో రెండవది. ఈ సముద్రంలోని నీరు అతి చల్లగా ఉంటుంది. ఈ సముద్రం ఎక్కువ ప్రాంతాలలో 4,000 నుండి 5,000 మీటర్లు లోతు కలిగి ఉన్నది.
పెంగ్విన్స్, నీలి తిమింగలాలు, సీల్ జంతువులు ఈ సముద్రంలో ఎక్కువగా ఉంటాయి.
ఆయిల్, గ్యాస్, మరియు సహజ మినరల్స్, బంగారం, మాంగనీస్ నిక్షేపాలు ఈ సముద్రతీరంలో ఉన్నాయి. ఓడలు ప్రయాణాలకు ప్రమాదకరమైనది ఈ సముద్రం. తుఫాన్లు, కొన్ని ప్రమాదకరమైన ప్రాంతాలు, పెద్ద పెద్ద మంచు కొండలు ఈ సముద్రంలో ఉన్నాయి