header

Acrots

ఆక్రోట్లతో మధుమేహ నియంత్రణ...
రోజూ ఓ గుప్పెడు వాల్ నట్స్ తినగలిగితే చాలా జబ్బులకు దూరంగా ఉండొచ్చు అంటున్నారు యేల్ విశ్వవిద్యాలయ నిపుణులు. ముఖ్యంగా మధుమేహాన్ని అడ్డుకోవచ్చని అంటున్నారు. ఇందుకోసం చక్కెర వ్యాధి వచ్చే సూచనలు ఉన్న వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళకు రోజూ సుమారు 50 గ్రాముల వాల్ నట్స్ ను ఇచ్చారట. దాంతో వాళ్ళలో చెడు కొలస్ట్రాల్ తగ్గడంతో బాటు రక్తనాళాల పనితీరు మెరుగైనట్లు గుర్తించారు. ఎందుకంటే ఈ రెండూ కూడా మధుమేహం, గుండెజబ్బులకు దారితీసేవే. పైగా వాల్ నట్స్ లో అధికంగా ఉండే ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ ఇ ఫోలేట్ లు బరువు పెరగనీయవనీ, కాబట్టి వీటిల్లో క్యాలరీలు ఎక్కవగా ఉన్నప్పటికీ రోజువారీ ఆహారంలో తీసుకోవటం వల్ల బరువు పెరుగుతారన్న భయం అవసరం లేదని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు.