header

Barley…బార్లీ …

Barley…బార్లీ …

ప్రకృతి అందించిన అత్యంత శక్తినిచ్చే ఆహారం బార్లీ
దీర్ఘాయుష్షుకు, రుగ్మతల నివారణకు, అథ్లెటిక్‌ శక్తిని పెంచడానికి, స్థూలకాయంతో పోరాడెందుకు అత్యుత్తమంగా సిఫార్సు చేయతగ్గ ఆహారం బార్లీ, వీటిలో లభించే ఫాస్పరస్‌ శరీరంలో ప్రతి కణం పనితీరులో ప్రముఖపాత్ర పోషిస్తుంది, కణజాలాల మరమ్మత్తు, అభివృద్ధిలో ఇది సహకరిస్తుంది.
బార్లీ సులువుగా జీర్ణమయ్యే శాకాహారం బార్లీ. వీటిని నేరుగా నీటిలో వేసుకుని గంజి తయారు చేసుకుని తాగినా, సూప్‌ల వంటి వాటిలో కలుపుకున్నా ఆరోగ్యం కుదుటబడుతుంది. ఎటువంటి అనారోగ్యం కలిగినా తీసుకోగల ఆహారం బార్లీ, నట్ వంటి ఫ్లేవర్‌గల భిన్నమైన సెరల్‌ గ్రెయిన్‌ బార్లి చప్పరించడానికి, పాస్తా వంటివి కనిసిస్టెన్సీతో ఉంటుంది. గోధుమతో పోల్చితే తేలికపాటి రంగుతో ఉంటుంది. మొలకల బార్లి అయితే మరింత ఆర్యోదాయకం అయినది. మాల్ట్‌ సిరప్‌లకు, స్వీటనర్లకు ఆధారితంగా ఉంటుంది.
వివిధరకాలు : బార్లీ పోషకాలు ఇప్పుడు అన్ని రూపాల్లోనూ లభ్యమవుతున్నాయి. ధాన్యం, ఆకులు, బార్లి ఎక్స్‌స్ట్రాక్ట్‌లను అనేక రకాల పదార్థాల ఆధారితంగా ఉపయోగిస్తున్నారు. బార్లి పోషకాన్ని విస్తృతంగా వాడేవి కొన్ని ఉన్నాయి.
బార్లీగ్రాస్‌ : ముఖ్యంగా బాగా లేతగా ఉండే ఆకులలో విటమిన్లు విస్తృతస్థాయిలో లభిస్తాయి. విటమిన్లు, ఖనిజాలు, ఎమినో ఆసిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్ అనేకం ఉంటాయి. అయితే బార్లీ గింజల్లో లభించేంతటి డైటరీ ఫైబర్‌ అయితే ఉండదు కాని, క్లోరోఫిల్‌ ఉంటుంది. శరీరంలోని హానికారకమైన విషతుల్యాలను వెలికి నెట్టడానికి ఇది ఎంతగానో సహకరిస్తుంది.
బార్లీ గ్రీన్‌ పౌడర్‌ : బార్లీలో గల అనేక ఔషధ గుణాల్ని గుర్తించిన చాలా కంపెనీలు ఇప్పుడు స్వచ్ఛమైన బార్లి గడ్డి నుంచి పొడిని తయారు చేస్తున్నాయి. బార్లీ జ్యూస్‌గా తీసుకునేందుకు అనువుగా సోల్యుబుల్‌ గుణం కలిగిన చక్కని ఫ్లేవర్లులో ఈ పొడులు తయారుచేస్తున్నారు.
బార్లీ ఫ్లోర్‌ : గోధుమ పిండి, కేక్‌ పిండులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోతగినది బార్లీ పిండి. పూర్తిస్థాయి బార్లీ నుంచి తయారు చేసే ఈ పిండి తెల్లని పెరల్‌ బార్లీ పిండికంటే పోషకాలు ఎక్కువగా కలిగి ఉంటుంది. ముడి బార్లిపై పొట్టు ఉండడమే ఇందుకు కారణం.
బార్లీ నీరు: కిడ్నీలకు ముఖ్యంగా ఒత్తిడికి గురయినపుడు బార్లీ నీరు బాగా ఉపయుక్తమైనది. కిడ్నీ, బ్లాడర్‌ రుగ్మతలున్న వారికి బార్లీ నీటిని థెరపిక్‌గా వాడతారు.
పెరల్‌ బార్లీ : అనేక పచారీ దుకాణాల్లో కనిపించే రకం, పొట్టును పూర్తిగా శుద్ధిచేసినపుడు బార్లి గింజలు తెల్లగా మెరిసిపోతూ కనిపిస్తాయి.
బార్లీ గింజలను ఉపయోగించే ముందు చల్లని నీటితో శుభ్రంగా కడిగితే మట్టి, దుమ్ము వంటివి ఉంటే పోతాయి. ఒకవంతు బార్లీలో మూడున్నర వంతుల వేడినీరు కలపాలి. నీరు బాగా మరుగుతున్నపుడు బార్లీ కలిపి సెగ తగ్గించాలి. పెరల్‌ బార్లీ అయితే సిమ్‌లో గంటసేపు పాత్రపై మూతపెట్టి ఉడికించాలి, హార్డ్ బార్లీ అయితే 90 నిమిషాలు ఉడికించాలి.
బార్లీ పిండిని గోధుమ పిండితో కలిపి చపాతీలు, బ్రెడ్‌ మఫ్లిన్లు వంటివి ఏవైనా చేసుకోవచ్చు. సూప్‌లలో అదనపు ఫ్లేవర్‌కోసం కొద్దిగా పిండి లేదా నానపెట్టిన గింజలు కలుపుకోవచ్చు. బార్లీ గంజి దైనందిన ఆహారంలో సగం మోతాదు అందించగలవు. గింజల్ని అన్నానికి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు.
లెక్కలేనన్ని పోషకాలు : బార్లీని ఆహారంగా ఏనాటి నుంచో వాడుతున్నారు. రుచి, ఫ్లేవర్‌ల దృష్ట్యా కాకుండా పోషకాల రీత్యా బార్లీ ప్రసిద్ధి గాంచింది, పీచు, సెలీనియం, ఫాస్పరస్‌, కాపర్‌, మాంగనీస్‌లకు మంచి ఆధారం, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఎమినో ఆసిడ్స్‌ మన ఆరోగ్యానికి అత్యవసరాలు, ఇవన్నీ బార్లీలో లభిస్తాయి. సోల్యుబుల్‌, ఇన్‌సోల్యుబుల్‌ ఫైబర్లు రెండూ వీటిలో లభిస్తాయి.
మహిళలకు మూత్రంలో రాళ్ళు ఏర్పడకుండా బార్లీలో ఇన్‌సోల్యుబుల్‌ ఫైబర్‌ సహకరిస్తుంది. బార్లీలో లభించే కాపర్‌, రుమాటాయిడ్‌ ఆర్థ్ర రైటిస్‌ అక్షణాలను తగ్గించగలదు. కోలాజెన్‌, ఎలాస్టిక్‌ల క్రాస్‌ లింకింగ్‌ కోసం అవసరమయిన లిసిల్‌ ఆక్సిడేస్‌ అనే ఎంజైమ్‌ పనితీరుకు కాపర్‌ అవసరం. ఈ పదార్థాలు ఎముకలు, జాయింట్లు, రక్తనాళాలకు మూలాధారాన్ని, ఫెక్సిబిలిటిని అందిస్తాయి.
రుగ్మతల నివారిణీ :పేగుల ఆరోగ్యాన్ని పెంపొందింపజేస్తుంది. పెద్ద పేగులలో ఫ్రెండ్లీ బ్యాక్టిరియా ఎదిగేందుకు బార్లీలోని డైటరీ ఫైబర్‌ తగిన ఆహారాన్ని అందిస్తుంది. కలోన్‌ క్యాన్సర్‌, హెమొరాయిడ్స్‌ రుగ్మతల ప్రమాదాన్ని నియంత్రిస్తుంది. కొలెస్టారాల్‌ను తగ్గించడంలో పీచు లక్షణాలో ఒకటైన ప్రొసియోనిక్‌ యాసిడ్‌ బార్లీలోని ఇన్‌సోల్యుబుల్‌ ఫైబర్‌ కొంతవరకు ఉత్పత్తి అవుతుంది.
బెల్‌ యాసిడ్స్‌ను వెలికి నెట్టడంద్వారా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సాయపడే బెటాగ్లుకాన్‌ బార్లీలోని డైటరిఫైబర్‌లో అధికంగా లభిస్తుంది. డయాబెటిస్‌ గలవారిలో బ్లడ్‌షుగర్‌ స్థాయిలు అత్యధికంగా పెరగకుండా బార్లీలో లభించే పీచు సాయపడుతుంది. నియాసిన్‌, విటమిన్‌ బి లకు మంచి ఆధారభూతమైనది.
గుండె సంబంధిత రిస్కులనుంచి అనేక చర్యల ద్వారా పోరాడుతుంది. బ్లడ్‌క్లాట్స్ కు దారితీసే ప్లేట్ లెట్స్ అసెంబ్లింగ్‌కు నియాసిన్‌ మేలుచేస్తుంది.
వారంలో కనీసం ఆరుసార్లు పూర్తిస్థాయి బార్లీ తీసుకుంటే ఎంతో మంచిది. ముఖ్యంగా అధిక కొలస్ట్రాల్‌ రక్తపోటు, ఇతర గుండె సంభందిత రుగ్మతల లక్షణాలు గల మెనోపాజ్‌ దశ దాటిన మహిళలకు ఇది అద్భుత ఆహారం, ఆర్థ్రోస్‌ క్లోరోసిస్‌, డయాబెటిస్‌, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌, స్ట్రోక్‌లకు వ్యతిరేకంగా పోరాడే శక్తివంతమైన ఆహారం. టైప్‌-2 డయాబెటిస్‌ గలవారికి ఓట్స్ కంటే బార్లి మంచి బ్రేక్‌ఫాస్ట్‌ కాగలదు. బాల్యంలో వచ్చే ఆస్త్మాను నయం చేయడంలో బార్లి సహకరిస్తుంది, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ నుంచి కూడా అది కాపాడుతుంది.