header

Beetroot Juice

ఆరోగ్యానికి బీట్ రూట్ జ్యూస్

కావల్సినవి
ఒక చిన్న ఎర్రని బీట్ రూట్
ఒక మీడియం సైజ్ యాపిల్
క్యారెట్ : 1
నిమ్మకాయ : సగం
తయారు చేసే విధానం
పైవాటన్నిటిని శుభ్రంగా కడిగి తుడవాలి. బీట్ రూట్ పైన చెక్కు తీసివేయాలి. బీట్ రూట్, క్యారెట్ లను చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. యాపిల్ ను కూడా చిన్న ముక్కలు చేసుకొని గింజలు తీసివేయాలి. వీటన్నిటిని మిక్సీలో వేసి రసం తీయాలి. ఈ రసంలో నిమ్మకాయ పిండి తాగాలి. ఈ జ్యూస్ కు యాపిలే కాకుండా ఇతర పండ్లు కూడా వాడవచ్చు. కానీ అచ్చం బీట్ రూట్ రసం త్రాగరాదు. బీట్ రూట్ రసం చాలా చిక్కగా ఉండి సైడ్ ఎఫెక్ట్స్ కలిగించే అవకాశం ఉంటుంది. బీట్ రూట్ రసంలో ఉన్న బెటలైన్ మన శరీరంలోని వ్వర్థాలను బయటకు పంపివేస్తుంది. వ్యాయామాలు చేసేముందు బీట్రూట్ రసం తాగటం వలన వ్యాయామాలు చేయటాని అధిక శక్తి వస్తుంది.