Best Food to Control BP…రక్తపోటును తగ్గించే సహజమైన ఆహారం…..
అరటి పండు అరటి పండ్లు శరీర శక్తిని పెంచటమే కాదు బ్లడ్ ప్రెజర్ ను కూడా అదుపులో ఉంచుతాయి. అరటి పండులో పొటాషియం ఉంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. కనుక ప్రతిరోజూ 1 లేదా 2 అరటిపండ్లు తినాలి. అంతకంటే అధికంగా తింటే వాటిలోని షుగర్ మీ శరీరంలోని షుగర్ స్ధాయి పెంచుతుంది. కనుక మితంగా తినాలి.
పచ్చని ఆకు కూరలు – పచ్చని ఆకు కూరలలో పోషకాలు అధికం. వాటిలో ఐరన్ ఉంటుంది. ఇవి మీ అధిక రక్తపోటు తగ్గిస్తాయి. వీటిలో విటమిన్ సి, ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం మొదలైనవి ఉంటాయి. చర్మం మెరుపు పొందుతుంది.
వెల్లుల్లి వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి మంచిది. అధిక రక్తపోటు నియంత్రణకు ప్రతిరోజూ రెండు రెబ్బలు వెల్లుల్లి తినవచ్చు.
టమాటాలు ఎర్రగా ఉండి మంచి రసాన్ని ఇచ్చే టమాటా పండులో ఎన్నో పోషకాలు, ప్రొటీన్లు ఉంటాయి. రక్తపోటు నియంత్రణకు ఈ పండు బాగా పని చేస్తుంది. వీటిలో వుండే లైకోపెన్ అనే యాంటీ ఆక్సిడెంట్ సహజంగా రక్తపోటు నియంత్రిస్తుంది. దీనిలో విటమిన్ సి,ఎ,ఇ, పొటాషియం, కాల్షియం వంటివి కూడా రక్తపోటు నియంత్రిస్తాయి.