header

Brown Grams

సెనగలు

సెనగలలో ప్రొటీన్ మరియు పీచు శాతం ఎక్కువగా ఉంటుంది. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. మలబద్ధకంతో బాధపడేవారికి తాజా సెనగలలోని పీచు మేలుచేస్తుంది. ఈ పీచు ఇన్సులిన్ శాతాన్ని సైతం క్రమబద్దీకరిస్తుందని అనేక పరిశోధనలలో తేలింది. రాఫినోజ్ అనే పీచు కారణంగా బీన్స్ రకాలన్నీ గ్యాస్ సమస్యలకు దారితీస్తాయి. వీటిని కాసేపు బేకింగ్ సోడాలో నానబెట్టి నీళ్లు ఒంపేసి వాడుకోవడం వల్ల సమస్య ఉండదని పరిశోధకులు చెబుతున్నారు.
సెనగల్లో పుష్కలంగా ఉండే ఐరన్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, విటమిన్-కె వంటివి ఎముకపుష్టికి తోడ్పడతాయి.
సెనగల్లోని పీచు, పొటాషియం, విటమిన్-సి, విటమిన్-బి6 వంటివి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.
సాధారణంగా పండ్లు, కూరగాయలలో సెలీనియం ఖనిజం పెద్దగా ఉండదు. కాని సెనగల్లో పుష్కలంగా దొరికే సెలీనియం క్యాన్సర్లు రాకుండానూ, కంతులు పెరగకుండానూ కాపాడుతుంది. సెనగల్లో డి.ఎన్.ఏ తయారీకి కారణమయ్యే ఫోలేట్ కూడా ఉంటుంది.
నిద్రకు, కండరాల కదలికలకీ అధ్యయనానికీ, జ్ఙాపక శక్తికి ఎంతో అవసరమైన కోలీన్ కు సెనగలు ఎంతో మేలు చేస్తాయి.
సెనగల్ని నానబెట్టిగాని, నానబెట్టి ఉడించిగానీ తీసుకోవచ్చు. అలాగే తినలేని వారు కొంచె కొత్తిమీర తురుము, నిమ్మరసం పిండుకుని తినవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇవి మంచి ఆహారం. ఎక్కువగా ఆహారం తినేవారు ఆహారం తినేముందు వీటిని కొద్దిగా తీసుకుంటే ఆకలి తగ్గి, పొట్టనిండుగా అనిపిస్తుంది. ఊబకాయం వారికి కూడా ఇవి మంచివి. సెనగల్ని 8 గంటలసేపు నానబెట్టి, కాటన్ క్లాత్ లో గట్టిగా మూటకట్టి 12గంటల సేపు ఉంచితే మొలకలు వస్తాయి. వీటిని తినటం చాలా మంచిది.