కొబ్బరిపాలు ఆవుపాలకంటే ఆరోగ్యకరమైనవని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఆవు పాలతో పోలిస్తే ఇవి సులభంగా జీర్ణమవుతాయి. కొబ్బరిపాలల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కనుక జీర్ణ సమస్యల నుండి బయటపడటానికి బాగా సహకరిస్తుంది. ఎలాంటి ఆహారమైనా త్వరగా జీర్ణమవటానికి ఇవి తోడ్పడతాయి. కొంతమంది పాల ఉత్పత్తులంటే ఇష్టపడరు. అలాంటి వారికి కొబ్బరిపాలు మంచిది. కొబ్బరిపాలు కీళ్ళ నొప్పులను తగ్గించడానికి మంచి ఔషధంలా పనిచేస్తాయి.
తీవ్ర ఒత్తిడి, ఆందోళనలతో బాధపడే వారికి కొబ్బరిపాలు చక్కటి పరిష్కారం. వీటిలో ఉండే పొటాషియం ఒత్తిడిని తగ్గిస్సుంది. కొబ్బరి పాలలో పోషకాలు మొండు. కొబ్బరిపాలలో ఉండే పోషకాలు శరీరంలో అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి. రోజుకో కప్పు కొబ్బరిపాలు తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. కొబ్బరిపాలలో ఉండే ఖనిజాలు క్యాన్సర్ ను అరికడతాయి. ప్రేగుక్యాన్సర్ కాలేయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ లను నివారించడానికి సహాయపడతాయి. క్యాన్సర్ సెల్స్ అభివృద్ధిని నిరోధించగలవు.
అందుకే తరచుగా కొబ్బరిపాలను ఆహారంలో చేర్చకోవడం మంచిది.