header

Benefits of Curd...పెరుగు

Benefits of Curd...పెరుగు

curd పెరుగు పాలల్లో పోషకాల సంఖ్య ఎక్కువే కానీ అందులోని లాక్టోజ్ ను అంతా అరిగించుకోలేరు. అదే పెరుగుయితే సమస్య ఉండదు. మలబద్ధకం, డయేరియా, పేగు కేన్సర్, మొలలు..వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పెరుగులో లాక్టో బాసిల్లస్ , స్ర్టెప్టోకాకస్ అనే భిన్న జాతులకు చెందిన ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. బ్యాక్టీరియా లాక్టోజ్ చక్కెరను లాక్టిక్ ఆమ్లంగా మార్చడం ద్వారా పాలల్లోని ప్రొటీన్లు అమైనో ఆమ్లాలుగా మారి గడ్డకడతాయి. అదే సమయంలో బ్యాక్టీరియా కాస్త పులిసేలా చేస్తుంది.
పెరుగుతో లాభాలు : పెరుగులోని బ్యాక్టీరియా పొట్ట పేగుల్లోని ఇన్ఫెక్షన్లను కలిగించే బ్యాక్టీరియాను అరికడతాయి. లేదంటే అవి అల్సర్లనీ తద్వారా క్యాన్సర్స్ ను కలిగిస్తాయి. పెరుగులో విటమిన్ – ఎ, ఇ, సి, బి2, బి6, బి12 విటమిన్లూ, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్, అయోడిన్ వంటి ఖనిజాలు, లాక్టోజ్ చక్కెరలు, కొవ్వు ఆమ్లాలు ఇలా ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పాలతో పోలిస్తే పెరుగులోని క్యాల్షిషం ఒంటికి పట్టి డి-విటమిన్ తయారీకి తోడ్పడుతుంది. అందుకే ఆస్టియోపోరోసిస్ తో బాధపడేవారికి పెరుగుతో మేలు. అసిడిటీతో బాధపడేవారికి పాలకన్నా పెరుగే ఎంతోమేలు. పిల్లలకూ, పెద్దలకు పెరుగు ఎంతో మేలు చేస్తంది. తరచూ ఈస్ట్ సంబంధిత ఇన్ఫెక్షన్లతో బాధపడేవారికి పెరుగు తినడం వల్ల ఫలితం కనబడుతుంది. వ్యాయామం తరువాత బాటిల్ నీళ్ళతో పాటు కప్పు పెరుగు తీసుకోవటం వల్ల వెంటనే శక్తిని పొందుతారు.
రాత్రిపూట పెరుగు తినకూడదా? అయుర్వేద శాస్ర్తం రాత్రిపూట పెరుగు తినవద్దని అంటుంది. వయసు పెరిగే కొద్ది జీర్ణశక్తి తగ్గుతుంది. కాబట్టి త్వరగా అరగదు. జీవక్రియ కూడా మందగిస్తుంది. ఫలితంగా బరువు పెరుగుతారు కనుక పెరుగు రాత్రిపూట తినవద్దంటారు. పిల్లలు ఊబకాయం లేకుండా అరుగుదల ఉన్నవారు తిన్నా ఫర్వాలేదు. కఫ రోగుల్లో శ్ల్మేషం ఎక్కువవుతుంది. పూర్తిగా తోడుకోని పెరుగు కూడా తినకూడదు. దీనివల్ల హెర్పిస్, సొరియాసిస్ వంటి జబ్బులు వచ్చే అవకాశం ఉందంటారు. అలాగే పాలు, పెరుగు కలపడం మంచిది కాదు. ఈ రెండు పరస్పర విరుద్ధ పదార్థాలు. అందుకే పెరుగులో మీగడ, పాలు వంటివి కలిపి చేసే వంటలు ఆరోగ్యానికి మంచివి కావంటారు విజయవాడకు చెందిన ఆయుర్వేద నిపుణులు జి.వి. పూర్ణానంద్.