header

Dates….ఖర్జూరం

Dates….ఖర్జూరం

ఖర్జూరం చెట్లు ఎడారి ప్రాంతాల్లో పెరిగే పండ్ల చెట్టు. ఇందులో ఆడా, మగా అంటూ రెండు రకాలు ఉంటాయి. ఆడ చెట్లకు మాత్రమే ఖర్జూరం పండ్లు కాస్తాయి. ప్రపంచమంతటా ఖర్జూరం లభ్యత ఉంటుంది. తక్షణమే శక్తినిచ్చేది ఖర్జూరం.
మొదటి ఆహార వృక్షంగా ఖర్జూరంను చెప్పుకుంటూ ఉంటారు. రంజాన్‌ సీజన్‌లో ఖర్జూరం తినడంతోనే ముస్లింలు ఉపవాసాన్ని ముగించడం జరుగుతూ ఉంటుంది. పండ్లలోని తేమను బట్టి మెత్తటివి, కాస్త ఎండినవి, పూర్తిగా ఎండినవి.. ఇలా రకరకాలు ఉన్నాయి.
పోషకాలు
ఖర్జూరంలో పిండి, చక్కెర పదార్థాలు ఎక్కువ. విటమిన్‌ సి మెండుగా లభిస్తోంది. పాస్ఫరస్, కాల్షియం లాంటి ఖనిజ లవణాలు ఖర్జూరంలో ఎక్కువగా లభిస్తాయి.
ఆరోగ్య పరంగా...
పెద్దపేగులోని సమస్యలకు ఖర్జూరం చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. మలబద్ధకం తగ్గడానికి, ఎముకలు బలంగా తయారవ్వడానికి, ఉదర క్యాన్సర్‌ను తరిమేయడానికి ఖర్జూరం బాగా ఉపయోగపడుతుంది. గర్భిణీలకు ఖర్జూరం తినిపిస్తే మంచిది. డయేరియా, రక్తపోటుతో బాధపడేవారికి కూడా ఖర్జూరం చక్కగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్‌లో ఖర్జూరంను చేర్చుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. చిన్నపిల్లల ఎదుగుదలకు మంచి ఆహారం. చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది కనుక మధుమేహంతో బాధపదేవారు ఖర్జూరాలకు దూరంగా ఉండటమే మంచిది.