మన పెద్దలు/ఆహారనిపుణులు సూచించిన కొన్ని తినకూడని పదార్థాలు
1. చేపలకూర తిని పాలు, పెరుగు, పాలపదార్థాలు తినరాదు అలా తినడం వలన రక్తం విషపూరితమై చర్మరోగాలు, రక్తస్రావాలు, రక్తపోటు, వణకు రోగాలు వస్తాయి.
2. తేనె, నెయ్యి మరియు తేనె వస సమంగా కలిపి వాడరాదు.
3. పాలు త్రాగే ముందు కాని తరువాత కాని పులుపు పదార్థాలు తినకూడదు. పాలు, ఉప్పు కలపి త్రాగరాదు.
4. నూనెను ఒకసారి వేడిచేసి వాడిన తరువాత తిరిగి మళ్ళీ వాడరాదు. అలా వాడితే క్యాన్సర్ రోగకణాలు రాగలవు.
5. వేడిచేసే పదార్థాలు మరియు చలువచేసే పదార్థాలు కలిపి తినరాదు.
6. కల్లు, సారాయి, బ్రాంది మొదలగునవి సేవించిన వెంటనే పాలు తీసుకోరాదు.
7. పక్యానికి రాని పండ్లు, కాయలు తినరాదు. తింటే ఉదర సమస్యలు రాగలవు.
అరటి పండును గురించి కొన్ని విషయాలు: పూర్వకాలం అరటి గెలలను మాగపెట్టానికి గడ్డిని చుట్టి మాగవేసే వారు. ప్రస్తుతం కార్బైడ్ ను పొగరూములలో ఉంచే విధానం వచ్చింది. అయితే ఇప్పుడు ఆపిల్ పండ్లకు రంగు వచ్చేందుకు ఉపయోగించే టగ్ ఫోన్ అనే రసాయనం అరటి గెలలను మాగవేయానికి ఉపయోగిస్తున్నారు. ఈ రసాయనాన్ని నీళ్ళ తొట్టిలో వేసి అరటి గెలను అందులో ముంచి తీస్తారు. దీంతో సాయంత్రం లేక మరుసటి రోజు ఉదయాని కల్లా మాగి మంచి రంగు వస్తాయి. కేవలం అరి పండ్లే కాదు సపోటా, మామిడి, బత్తాయిలను కూడా ఈ విధానం ద్వారా కృత్రిమంగా పండిస్తారు.