header

Food Adulteration…ఆహార పదార్ధాలలో కల్తీలు...

నిత్యావసర వస్తువులో కల్తీ కారణంగా ఉదరకోశ, హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడవలసి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లోనే ఎవరికి వారు పరీక్షించుకొనే కొన్ని అవకాశాలు
కారం ఇందులో ఇటుకపొడి, రంపపు పొట్టు కలుపుతారు. కల్తీను గుర్తించే విధానం : బీకరులోకి కాస్త కారం తీసుకొని అందులో నీరు కలపాలి. కారం నీటిలో మునిగిపోతుంది.రంపపు పొట్టు కలిసి ఉంటే పైకి తేలుతుంది.ఇటుక పొడి ఉంటే నీటి అడుగు భాగానికి చేరుతుంది.
మిరియాలు బొప్పాయి గింజలను కలుపుతారు. కల్తీని గుర్తించే విధానం : మిరియాలను రుచి చూడండి. వెగటుగా రుచిగా ఉంటాయి.
కొబ్బరినూనె Coconut Oil Adulteration... సాధారణంగా ఖనిజ నూనెలను కలుపుతారు. కల్తీని గుర్తించే విధానం : కొంచె కొబ్బరి నూనెను ఒక గిన్నెలోకి తీసుకొని ఫ్రిజ్‌లో అరగంట ఉంచి తీసి చూడాలి.స్వచ్ఛమైన కొబ్బరినూనె గడ్డకడుతుంది. కల్తీ జరిగితే గడ్డ కట్టదు.
కందిపప్పు ఎక్కువగా కేసరి పప్పు కలుపుతారు. కల్తీని గుర్తించే విధానం : భూతద్ధంలో చూసి గుర్తించవచ్చు. కందిపప్పు గుండ్రంగా, కేసరి పప్పు పలకగా ఉంటుంది. లేక కొంత కందిపప్పును పరీక్షనాళికలోకి తీసుకొని 5 మి.లీ. హైడ్రోక్లోరికామ్ల ద్రావణాన్ని కలపాలి. దానిని 15 నిమిషాల పాటు ఉంచి పరీక్షించాలి. నమూనాలో గులాబీ రంగు కనిపిస్తే కల్తీ జరిగినట్లు
Adulteration in Sugar...చక్కెర వాషింగ్‌ షోడాను కల్తీ చేస్తారు. కల్తీని గుర్తించేవిధానం : కొంచెం చక్కెరను నీటిలో వేసి స్పూన్‌తో వేగంగా తిప్పాలి. చక్కెర కల్తీ ఉంటే నురగలు వస్తాయి.
Cloves Adlteration... లవంగాలు నూనె తీసిన లవంగాలను కలుపుతారు. లవంగాలను వేడి చేయండి ముడుచుకొని చిన్న సైజుగా మారుతాయి. Ghee Adulteration…నెయ్యి/వెన్న క్కువగా వెన్న, నెయ్యిని వనస్పతితో లేదా ఇతర నూనెలతో కల్తీ చేస్తుంటారు.
ఎలా గుర్తించాలి...? వెన్న, నెయ్యిని వేడి చేయగానే కమ్మటి స్వచ్ఛమైన కమ్మటి వాసన వస్తుంది. కల్తీ నెయ్యి అయితే పెద్దగా వాసన ఉండదు. రుచిలో తేడా కన్పిస్తుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే కల్తీని గుర్తించవచ్చు. Cooking Oils Adulteration..…వంటనూనెలు వంటనూనెల్లో జంతుకొవ్వు, ఇతర గింజలతో తయారు చేసిన నూనెలకు కలిపి కల్తీ చేస్తుంటారు. ఎక్కువగా చిల్లరగా అమ్మే నూనెల్లో ఈ కల్తీలు ఎక్కువగా జరుగుతుంటాయి. నూనెల కల్తీల వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ;
ఎలా గుర్తించాలి...?: రంగు, వాసనలో తేడా ఉంటుంది. వంటలో వాడినా సరైన రుచి ఉండదు. చేతికి, పళ్లాలకు ఎక్కువగా జిడ్డు అంటుకుంటుంది. కొబ్బరి నూనెలో కల్తీ కనిపెట్టడం సులువే. కొంత నమూనాను గిన్నెలో తీసుకొని ఫ్రిజ్లో ఉంచాలి. స్వచ్ఛమైన కొబ్బరి నూనె గడ్డకడుతుంది. కల్తీది గడ్డ కట్టదు.
Milk Adulteration…పాలలో కల్తీ.. సహజంగా వేసవి కాలంలో పాల కొరత ఉంటుంది. ఇదే అదనుగా కొందరు పాలను కల్తీ చేసి సొమ్ము చేసుకునే అవకాశం ఉంది. పాలలో నీళ్లు, పిండి, గంజి, యూరియా, నూనె, డిటర్జెంట్ పౌడర్ కల్తీ చేసి కృత్రిమ పాలు తయారు చేస్తున్నారు. అజీర్ణం, వాంతులు, ఇతర జీర్ణకోశ, అనారోగ్య సమస్యలు వస్తాయి. పాలలో ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు కలపడం వల్ల అతిసారానికి దారి తీస్తుంది. ఎలా గుర్తించాలి...? పాల చుక్కలను ఏటవాలు ప్రదేశంపై పోసినప్పుడు పాలు నీటిని వదిలి వేగంగా కిందకు ప్రవహిస్తే కల్తీ జరిగినట్లే. వేడి చేసినప్పుడు పసుపు వర్ణంలోకి మారినా చేదుగా, వెగటుగా అన్పించినా సింథటిక్ పాలని అర్థం.