ఉసిరి తురుము - ఒక కప్పు
నీళ్ళు - పావు కప్పు
- పంచదార - కప్పు
- యాలకుల పొడి - అర టీ స్పూను
- దాల్చిన చెక్క- అంగుళం ముక్క
దళసరి అడుగున్న పాన్ లో ఉసిరి తురుము…పంచదార…నీళ్ళు పోసి పంచదార కరిగేవరకు ఉడికించాలి. లేత తీగపాకం వచ్చే ముందు మంట తగ్గించి యాలకుల పొడి, దాల్చిన చెక్క వేసి మరో మూడు నిమిషాలు ఉంచాలి. తర్వాత పాత్రను దించేయాలి
మిశ్రమం చల్లారిన తర్వాత దాల్చిన చెక్క తీసేసి గాజు సీసాలో పోసి ఫ్రిజ్‌లో ఉంచాలి. బ్రెడ్ తో తినవచ్చు. పరగడుపున అర టీ స్పూను చొప్పున తీసుకున్నా కూడా ఆరోగ్య రీత్యా మంచిది.