అద్భుతం .... రాతి ఉసిరి.. భారతదేశంలో లభించే అద్భుతమైన ఔషధం ఉసిరి. ఆహారం, శరీరంలో శోషణం కావటాన్ని వృద్ధి చేసి, ఉదరంలోని ఆమ్లాలను తటస్థీకరిస్తుంది. జీర్ణవ్యవస్థను సరిచేస్తుంది. కాలేయాన్ని సంరక్షిస్తుంది. మొదడుకు చేవనిస్తుంది. ఆలోచనా తీరును మెరుగు పరుస్తుంది. శరీరక శక్తిని పెంచుతుంది. కండలను పెంచుతుంది. క్యాన్సర్ గడ్డల పెరుగుదలని నిదానింపచేస్తుంది. ఊపరి తిత్తులు బలంగా తయారవుతాయి. ఫ్రీరాడికల్స్ ను బయటకు పంపించటాన్ని సరిచేస్తుంది. శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపుతుంది. గుండె ధమనులలో అడ్డు ఏర్పడకుండా చూస్తుంది.ఆక్సిడేషన్ కు కారణమయ్యే ఒత్తిడిని అడ్డుకుంటుంది. ధమనుల గోడలపై గార ఏర్పడకుండా ఆపటం ద్వారా అధిక రక్తపోటు లాంటి ఇబ్బందులు రాకుండా చేసి గుండెను కాపాడుతుంది. కొలెస్ట్రాల్ ను తగ్గంచటంలో సహాయపడుతుంది. ఉసిరిలో ఉండే డిజిజి-16, కొరిలాజిన్ అనే మిశ్రమాలు చెడుకొవ్వు యల్ డి యల్ ఢమనుల గోడలకు అతుక్కుపోకుండా చూస్తుంది. మధుమేహం తగ్గించడంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఉసిరిని ఎలా తినాలి ?..... చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని సలాడ్లలో కలుపుకుని తినవచ్చు. వీటిలోని పులుపును తగ్గించటానికి కొద్దిగా ఉప్పుచల్లుకోవచ్చు. భోజనం చేసే ముందు ఒక చెంచా ఉసిరిపొడి తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఎండబెట్టి పొడి చేసుకున్న పొడిని రోజూ తినటం వలన సాధారణ జలుబు, జ్వరాలను తగ్గుతాయి. ప్రతిరోజూ ఒకటి రెండు ఉసిరికాయలు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రసం చేసుకునికూడా తాగవచ్చు. ఒకటి, రెండు ఉసిరి కాయలను గ్రైండ్ చేసుకుని గ్లాసు నీళ్ళలో కొద్దిగా తేనె కలుపుకుని కలుపుకుని తాగవచ్చు. రోజూ గ్లాసుకంటే ఎక్కువ తాగరాదు. మధుమేహం వారు రోజూ ఉసిరి పొడిని తీసుకోవటం వలన వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.