మానవజాతికి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఆహారం తేనె.శుద్ధి చేయని ముడి తేనెలో విటమిన్లు, ఎంజైమ్ లు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదానికి తేనె ప్రాణం వంటిది.
పంచదారకన్నా తీయగా ఉండే తేనెను రోజూ తీసుకోవటం వలన గుండె రోగాలు బాగా తగ్గుతాయి. తేనెలో ఉండి విటమిన్ సి, మోనో ఫినాలిక్ లూ ఫ్టేవనాయిడ్లు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేయడం వలన హృద్రోగాలు తగ్గుతాయి. తేనెలో నిమ్మరసం, దాల్చిన చెక్కపొడి కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారంటారు.
ముడితేనె బీ.పిని తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది. శరీరంలోని ఇన్సులిన్ శాతాన్ని క్రమబద్దీకరిస్తుంది.
వ్యాయామం తరువాత తేనెను సేవించటం వలన అలసట ఉండదు.
తేనె మంచి యాంటీసెప్టిక్ గుణాలు కలిగి ఉంటుంది. తేనె శరీరంలోని హానికరమైన ప్రీరాడికల్స్ ను తొలగిస్తుంది. మచ్చలను మాయం చేయటంలో తేనెను మించినది లేదు.
తేనెలో విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మాంగనీస్, ఫాస్పరస్ జింక్, సోడియం, వంటి ఖనిజాలతో పాటు విటమిన్లూ ప్రొటీన్లు ఉంటాయి. పోషకాహరలేమితో బాధపడేవారి మంచి ఆహారం తేనె.
సౌందర్యపరంగా...
తెనె చర్మసౌందర్యానికి అద్భుతంగా పనిచేస్తుంది.మొహానికి ప్యాక్ లా వేయడం వలన చర్మం పునరుజ్జీవితం అవుతుంది. తెనె సహజ మాయిశ్ఛరైజర్ లాగా పనిచేస్తుంది.
తేనె నాణ్యత పూలరకాల మీద ఆధారపడి ఉంటుంది. రకరకాల పూలనుండి సేకరించిన తేనెలో ఔషధ గుణాలెక్కువగా ఉంటాయి.
తెనె ఎప్పటికీ పాడవదు. బజారులో కొన్న తెనె కొన్ని రోజులకు ముదురు రంగులో మారుతుంది. ఎక్కువ కాలం నిలవ ఉండటం వలన తెనెలోని సహజ ఔషధ గుణాలు తగ్గటం వలన ఇలా జరుగుతుంది. కనుక ఎక్కువ కాలం నిల్వ ఉన్న తేనె కొనుగోలు చేయరాదు.
తెనెలో నీటి శాతం 15 కన్నా ఎక్కువగా ఉంటే త్వరగా పులుస్తుంది. తేనెను స్పూనుతో పైకి తీస్తే వేగంగా జారుతుంటే అందులో నీటి శాతం ఎక్కువని గ్రహించాలి. అలాంటి తేనెను కొనరాదు. తేనెను ప్రాసెసింగ్ చేయటం వలన సహజంగా ఉండే బ్యాక్టీరియా, విటమిన్లు, ఎంజైమ్ లు హరించుకుపోతాయి. కాబట్టి ముడి తేనెను కొనటం మంచిది.
తేనె నాణ్యత కాలంమీద కూడా ఆధారపడి ఉంటుంది. పూలు ఎక్కువగా పూచే వేసవికాలంలో లభ్యమయ్యే తెనె మంచి వాసనతో చక్కగా ఉంటుంది.
v
వడబోసిన తెనె మంచిది కాదు. తెనెలో ఉన్న పుప్పొడి రేణువులు వలనే తేనెకు ఔషధ గుణాలుంటాయి. పుప్పొడి లేని తెనె పంచదార లాంటిదే కనుక ఆరోగ్యానికి హానికరం కూడా.
శుభ్రమైన నూలు వత్తిని తేనెలో మంచి వెలిగిస్తే ఆ వెలుగు ప్రకాశవంతంగా ఉండాలి. చిటపటలాడితే కల్తీ తెనెగా భావించాలి.
తెనెను కాగితం మీద వేస్తే అంటకుండా ఉండాలి. కాగితం తెనెను పీల్చినా, కాగితం అడుగు భాగానికి కారినా కల్తీ తెనే.