header

Jaggery… బెల్లం…

Jaggery… బెల్లం…

పంచదార మరియు బెల్లం రెండింటిలోనూ బెల్లమే మంచిదంటున్నారు ఆహార నిపుణులు...
బెల్లం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. పాలల్లో బెల్లం తరుగును వేసి తాగితే ఎముకలు దృఢంగా ఉంటాయి. కీళ్లు, ఆర్థ్రరైటిస్‌ లాంటి ఎముకల బాధలు పోతాయి. బెల్లం తింటే బరువు తగ్గుతారు. ఇందులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. పొటాషియం శరీరంలోని ఎలక్ర్టొలైట్స్‌ను సమతులం చేస్తుంది. కండరాలను పెంచడమేగాక పటిష్టం చేస్తుంది. జీవక్రియ సరిగా అయ్యేట్టు సహాయపడుతుంది.శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అంతేకాదు రక్తంలోని హిమోగ్లోబిన్‌ ప్రమాణాన్ని పెంచుతుంది.
- ఐరన్‌, ఫొటేట్‌లు బెల్లంలో బాగా ఉండడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. ఎర్రరక్త కణాలు కూడా సాధారణ ప్రమాణంలో కొనసాగుతాయి. బెల్లం వాడకం వల్ల శరీరంలోని ఎనర్జీ లెవల్స్‌ పెరుగుతాయి. వైద్యుల సలహా మేరకు గర్భిణులు బెల్లం తింటే ఎంతో మంచిది. ఈ టైములో ఆడవాళ్ళు ఎదుర్కొనే రక్తహీనత, ఐరన్‌ లేమి సమస్యలు బెల్లం తినడం వల్ల తగ్గుతాయి. చర్మ సౌందర్యాన్ని పెంచే విటమిన్లు, మినరల్స్‌ కూడా ఇందులో ఉన్నాయి.ప్రతి రోజూ కొద్దిగా బెల్లం తింటే మెరిసే చర్మం మీసొంతమంటున్నారు నిపుణులు
- మొటిమలు, మచ్చలు రాకుండా... చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది. చర్మం ముడతలు పడడాన్ని తగ్గిస్తుంది. చర్మం మీద మచ్చలను పోగొడుతుంది. వెయిట్‌ లాస్‌ డైట్‌లో బెల్లం ఎంతో ముఖ్యమైంది. జలుబు, దగ్గు, తలనొప్పులకు బెల్లం బాగా పనిచేస్తుంది గొంతుమంటను తగ్గిస్తుంది.
బెల్లంలో కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి తక్కువగానే తింటే మంచిది. అతిగా తింటే శరీర బరువు పెరిగే ప్రమాదం ఉంది. బ్లడ్‌ షుగర్‌ ప్రమాణాల్లో తేడాలు వస్తాయి.
మితంగా వాడితే రక్తపోటు, గుండెజబ్బుల రిస్కు తగ్గిస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. రోజూ కొద్దిగా బెల్లం తినడం వల్ల శ్వాసకోశ సంబంధమైన అస్తమా, బ్రాంకైటిస్‌ వంటివి తగ్గుతాయి