ఆరోగ్యానికి సలాడ్ మొక్క లెట్యూస్. సలాడ్లతోపాటు దీన్ని శాండ్‌విచ్‌లూ, సబ్‌లూ, బర్గర్‌లూ, రాప్‌లూ, సూపులూ, మరెన్నింటిలో ఎక్కువగా వాడతారు. కొద్దిగా గ్రిల్ చేసి కూడా ఇష్టంగా తినవచ్చు.
లెట్యూస్‌లో ఔషధగుణాలు కూడా చాలా ఉన్నాయి. కొలెస్ట్రాల్‌నూ, మధుమేహాన్ని కీళ్లనొప్పులను తగ్గిస్తుంటారు. నిద్రలేమిని నివారిస్తుంది. ఆరోగ్యమైన జుట్టూ, చర్మనిగారింపునకు తోడ్పడుతుంది. ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. లెట్యూస్‌ను ఇళ్లలో కూడా కుండీలలలో పూల మొక్కలతో పాటు కలిపి పెంచుకోవచ్చు. వీటి విత్తనాలు ఆన్ లైన్ స్టోర్లలో దొరకుతాయి
ఎ, సి, కె, బి-, బి12 విటమిన్లూ, ఐరన్, పొటాషియం, మాంగనీస్ లాంటి ఖనిజ లవణాలూ, యాంటీఆక్సిడెంట్లూ, మాంసకృత్తులూ, పీచు పదార్థం ఉంటాయి. ఇక, దీనిలో కొవ్వూ, కెలొరీలు దాదాపు లేకపోవడం మరొక ముఖ్య విషయం.