header

Meal Maker…మీల్ మేకర్...

Meal Maker…మీల్ మేకర్...

Meal Maker…మీల్ మేకర్... డా.లహరి సూరపనేని, న్యూట్రిషనిస్ట్, వెల్ నెస్ కన్సల్టెంట్...సౌజన్యంతో
మీల్ మేకర్ లేదా సోయా నగ్గెట్స్...శాకాహాకరులకు ప్రోటీన్స్ (మాంసకృత్తులు) అందించే మంచి ఆహారం. పాలు, మాంసం, గుడ్లు కంటే సోయాలోనే ఎక్కువ ప్రొటీన్సు ఉంటాయి. శరీర కణజాలాల నిర్మాణానికి అవసరమై అమైనో యాసిడ్లు సోయాలో లభిస్తాయి. సోయాలోని లభించే మేలురకం ప్రొటీన్సు అన్ని వయసులవారికి అవసరం. పిల్లలలో ఆరోగ్యకరమైన ఎదుగుదలకూ, ఎముకల అభివృద్ధికి ఇవి ప్రయోజనకారి. మోనోపాజ్ వయసులో ఉన్న మహిళలలో ఎముకలు గుల్లబారడాన్ని అరికట్టేందుకు సోయా తీసుకోవటం తప్పనిసరి. సోయాలో ఉండే ఫైటో ఈస్ట్రోజన్ రక్తంలో ఏర్పడే గడ్డలను నిరోధిస్తుంది. సోయాలో కొవ్వు పదార్ధాలు, ముఖ్యంగా సాచురేటెడ్ ఫాట్స్ చాలా తక్కువ. దీనిలో జీర్ణకోశానికి మేలు చేసే పీచు పదార్ధాలు, వృద్దాప్య ఛాయలకు అరికట్టే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. వారంలో ఒకసారి ఐనా తప్పనిసరిగా మీల్ మేకర్ ను తినాలంటారు డా.లహరి.