header

Maize…Corn…Mokkajonna…

Maize…Corn…Mokkajonna…

మొక్కజొన్నలతో మేలెంతో.... డా. పెద్ది రమాదేవి, ఆయిర్వేదిక్‌ ఫిజీషియన్‌.
వందగ్రాముల గింజల్లో పోషక విలువలు : పిండిపదార్థాలు 9 గ్రా. ఫాస్పరస్‌ 120 గ్రా కొవ్వు 1.2 గ్రా క్యాల్షియం9 మి. గ్రా. విటమిన్‌ సి 7 మి.గ్రా విటమిన్‌ బి 10 మి.గ్రా, మాంగనీసు 37 మి.గ్రాములు లభిస్తాయి
మొక్కజొన్నల్లో గ్లూటెన్‌ , సెల్యులోజ్‌, పీచుపదార్థాలు లభిస్తాయి. అవి పేగుల్లోని వ్యర్థాలను బయటకు పంపి, మలబద్ధకాన్ని దూరం చేస్తాయి. చక్కెర వ్యాధితో బాధపడేవారు, బరువు తగ్గాలనుకునేవారు ఈ గింజలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. వీటిలో లభించే కొన్ని పదార్థాలు క్యాన్సర్‌ కణాల వృద్ధి చెందకుండా అడ్డుపడతాయి. గుండె పనితీరు సక్రమంగా ఉంటుంది. గింజల్లో కొవ్వు పదార్థాలు అంటే వెన్న, నూనె, క్రీమ్‌ వంటివి వేయకుండా తింటే త్వరగా అరుగుతాయి. వీటిలో ఉండే నూనెలు చర్మసంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. అలానే పొత్తుల చివరన ఉండే పీచు ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఈ నల్లని పీచును ఉడికించి ఆ నీళ్ళను వడకట్టి తీసుకుంటే మూత్రాశయానికి సంబంధించిన ఏ ఇబ్బందులు ఉండవు. వీటిని ఇతర ఏ పదార్థాలలోనూ కలిపి తీసుకోకూడదు. తీసుకున్న వెంటనే గోరువెచ్చని నీళ్లు తాగడం తప్పనిసరి. అరుగుదల సరిగా లేనివారు, పాతబియ్యం, పెసలు, పేలాలు, చేపలు, బాగా ఉడికిన మాంసం, లేత ముల్లంగి, వెల్లుల్లి, పచ్చి అరి, ఆనప,బీర, పొట్ల, వంకాయ, బీన్స్‌, కేరెట్, దానిమ్మ, నారింజ, ఆవుపాలతో చేసిన మజ్జిగ వంటివి తీసుకోవాలి.
కడుపు నిండా భోజనం చేశాక మొక్కజొన్న గింజలు, చిక్కుళ్ళు, పప్పులు తీసుకోవడం అంత మంచిది కాదు. ఆకలిగా అనిపించినపుడు తీసుకోవచ్చు. లేత గింజల్లో పోషక విలువలు అధికం. వందగ్రాముల మొక్కజొన్నల్లో 365 కిలో కేలరీల శక్తి ఉంటుంది.
మొక్కజొన్నలలో సెల్యులోజ్, గ్లూటెన్ లు ఎక్కువ. బరువు తగ్గాలనుకునేవారు, డయాబెటిక్ తో బాధపడేవారు మొక్కజొన్నలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చని డా.పెద్దిరెడ్డి రమాదేవి, ఆయిర్వేదిక్ ఫిజీషియన్ గారు తెలియజేస్తున్నారు.
మొక్కజొన్నలలో శక్తివంతమైన పోషకాలతో బాటు ఎ, బి.సి, ఇ, విటమిన్లు కొన్ని ఖనిజాలు కూడా ఉన్నాయి. వీటిని ఉడికించి గాని, నిప్పుల మీద కాల్చి కాస్త నిమ్మరసం రాసుకొని తినవచ్చు. శరీరానికి అవసరమైన పోషకాల శాతం నిమ్మరసం వలన పెరుగుతుంది.
రోజువారీ అవసరమైన పీచు ఓ కప్పు కార్న్ గింజలలో ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను నివారిస్తుంది.
మొక్కజొన్న గింజలకు వెన్న, నెయ్యి, నూనె, క్రీమ్ వంటివి కలపకుండా తింటే త్వరగా అరుగుతాయి. ఇవన్నీ కలిపి తింటే క్యాలరీలు ఎక్కవవుతాయి. మొక్కజొన్నలను ఇతర ఆహార పదార్ధాలతో కలిపి తినకూడదు. అన్నం, టిఫిన్ తిన్న తరువాత మొక్కజొన్న గింజలు తిన కూడదు. కొద్దిగా ఆకలి వేసినపుడు గానీ, సాయంత్రం స్నాక్స్ గా కానీ తీసుకోవచ్చు.
మొక్కజొన్నలలో పుష్కలంగా ఉండే థైమీన్, నియాసిన్ అనే విటమిన్లు నాడీ వ్యవస్థ పనితీరుని చక్కగా ఉంచుతాయి. గర్భిణులకు అవసరమైన ఫోలేట్ శాతం ఎక్కువ. మొక్కజొన్నలలో ఖనిజాల శాతం కూడా ఎక్కువే. మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. ఎముకల బలానికి అవసరమయ్యే మెగ్నీషియం లభిస్తుంది.
మొక్కజొన్నల నుండి తీసిన నూనెకూడా మంచిదే. మొక్కజొన్న నూనెలో ఉండే ఫైటో కెమికల్స్ ఇన్సులిన్ ఉత్త్పత్తికి దోహదం చేయటంతో రక్తంలో చక్కెర నిల్వలు పేరుకోకుండా ఉంటాయి. ఈ నూనెలో అన్ శాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉండటం వలన కొలస్ట్రాల్ తగ్గుతుంది.
కానీ మొక్కజొన్నల నుండి తీసిన కార్న్ సిరప్ ను శీతల పానీయాలలో వాడతారు. ఈ పానీయాలలో ఫ్రక్టోస్ ఎక్కవగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అంత మించిది కాదు.
పిల్లలు కానీ, పెద్దలు కానీ మొక్కజొన్నల సీజన్లో బజ్జీలు,పునుగులు ఫాస్ట్ ఫుడ్ కు బదులుగా వీటిని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు. మన రైతులకు కూడా సహాయం చేసినవారవుతారు.