పుట్టకొక్కులు : పుపుట్టగొడుగులలో పోషకాలు పుష్కలంగా ఉండడమే కాదు అనేక వ్యాధులను నియంత్రిస్తాయి. శక్తివంతమైన ఆహారంగా ఉపయోగపడతాయి.ట్టకొక్కులలో పోషకాలు అధికం. 40 సం.దాటిన మహిళలు మాంసాహారానికి బదులు రోజుకో కప్పు పుట్టకొక్కులు తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
పుట్టకొక్కులు తినటం వలన శరీరానికి విటమిన్ డి, బి, రైబోఫ్లైవిన్, నియాసిన్, వంటి ఎన్నోపోషకాలు అందుతాయి. ఎర్ర రక్తకణాలు, పెరుగుతాయి. చర్మానికి మేలు జరుగుతుంది. జీర్ణవ్యవస్ధ మెరుగు పడుతుంది.
పుట్టకొక్కులలో ఉండే ఖనిజాలు నాడీవ్యవస్ధను దృఢంగా ఉంచుతాయి. హార్మోన్ల అసమతుల్వత రాదు.
వీటిల్లో లభించే సెలీనియం యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని మృతకణాలను దూరం చేసి కొత్తకణాల అభివృద్ధిని పెంచుతాయి.
పుట్టకొక్కులలో ఉండే రాగి శరీరానికి అవసరమైన ప్రాణవాయువుని అందించి ఎముకలను బలంగా ఉంచుతుంది.
పుట్టకొక్కుల నుంచి లభించే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచి కండరాలను ఉత్తేజితం చేస్తుంది.
పుట్టకొక్కులలో కొవ్వు, కెలోరీలు తక్కువ. ఇవి తింటే శరీరానికి శక్తి మాత్రమే లభిస్తుంది. బరువు తగ్గాలనేకునే వారికి పుట్టకొక్కులు మంచి ఆహారం.
పుట్టగొడుగులు
పుట్టగొడుగులలో యాంటీ ఆక్సిడెంట్ల శాతం ఎక్కువ. పండ్లు కూరగాయలలో అంతగా లభించని సెలీనియం శాతం వీటిల్లో ఎక్కువ. ఈ సెలీనియం కాలేయ ఎంసైమ్ల పనితీరును ప్రభావితం చేస్తుంది. క్యాన్సర్ కారకాలను తొలగించేందుకూ దోహదపడుతుంది. కంతుల పెరుగుదలను అడ్డుకుంటుంది. మొత్తంగా రోగనిరోధకశక్తినీ పెంపొందిస్తుంది. వీటిల్లోని విటమిన్ డి పొలేట్లు సైతం క్యాన్సర్ కణుతులను పెరగకుండా చేస్తాయి.
పీచు అధికంగా ఉండే పుట్టగొడుగులు మధుమేహరోగులకు ఎంతో మంచివి. ఇవి రక్తంలోని చక్కెర, ఇన్సులిన్, లిపిడ్ల శాతాన్ని ప్రభావితం చేస్తాయి.
అధికంగా ఉండే పొటాషియం తక్కువగా ఉండే సోడియంల కారణండా ఇవి బీపీని తగ్గిస్తాయి. ఇంకా వీటిల్లో ఎక్కువగా ఉండే సి విటమిన్ గుండె ఆరోగ్యానికి మంచిదే.
వీటిల్లోని బీటా గ్లుకాన్స్, చిటిన్ అనే రెండు రకాల పీచు పదార్ధాల బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఆహారం. పైగా ఈ బీటా గ్లుకాన్లు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి.
పుట్టగొడుగుల్లోని కోలిన్ మంచి నిద్రపట్టేలా చేయడంతో బాటు అధ్యయన, జ్గ్నాపక శక్తులను పొపంపొందిస్తుందని తేలింది. అందుకే రోజూ 25 నుండి 30 గ్రాముల పుట్టగొడుగులను ఆహారంలో భాగంగా చేసుకొమ్మని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు.