header

Ceasame seeds....Nuvvulu

Ceasame seeds....Nuvvulu....నువ్వులు

భారతీయులు నువ్వుల్ని సంప్రదాయ ఆహారంలో ఎప్పటి నుంచో వాడుతున్నారు. వేల సంవత్సరాల నుంచీ పండిస్తోన్న పురాతన పంటల్లో నువ్వులు ఒకటి. నువ్వుల స్వస్థలం భారతదేశమే. అన్ని రకాల వంటల్లోనూ వాడతారు. ఆడపిల్లలు రజస్వల కాగానే ముందు పెట్టేది నువ్వుల ఉండలూ, నువ్వు అరిసెలే. నువ్వులతో చేసే చిక్కీలూ, ఉండలూ, నువ్వులపొడి వాడి చేసే వంటల రుచి భారతీయులకు కొత్తకాదు.
నువ్వులు మంచి పోషకనిల్వలు. నువ్వులలో సిసామిన్, సిసామల్ అనే లిగ్నన్లు బిపీని రక్తంలోని కొవ్వులను క్యాన్సర్లను కూడా బాగా తగ్గిస్తాయని పరిశీలనలో తేలింది. రోజూ సుమారు రెండు స్పూన్ల నువ్వులు తింటే రక్తంలో చెడు కొలస్ట్రాల్ తగ్గుతుందని అంతే కాక నువ్వుల నూనె రక్తంలో కొవ్వులు పేరుకోకుండా చేయటం ద్వారా హృద్రోగాలను నియంత్రిస్తుందని పరిశోధనలు తెలియ చేస్తున్నాయి.
నువ్వులలోని లిగ్నన్ల కారణంగానే విటమిన్ –ఇ అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తూ వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులను నియంత్రిస్తుంది. నువ్వులలో ప్రొటీన్ కూడా ఎక్కువే. రెండు టేబుల్ స్పూన్ల నువ్వులలో 4.7 గ్రాములో ప్రొటీన్ లభిస్తుంది.
నువ్వులలో ఉన్న ధైమీన్, ట్రిప్టోఫాన్ అనే విటమిన్లు సెరటోనిన్ ను ఉత్పత్తి చేయటం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంచి మంచి నిద్రపట్టేలా చేస్తుంది.
గుప్పెడు నువ్వులో ఓ గ్లాసు పాలలోకన్నా ఎక్కువ క్యాల్షియం లభిస్తుంది. ఇది ఎముకల ఆరోగ్వాన్ని పెంచి ఆస్టియో పొరోసిస్ ను నివారిస్తుంది.
నువ్వులలోని కాపర్ కీళ్ళనొప్పులు రాకుండా కాపాడుతుంది. అనీమియాతో బాధపడుతున్నవారికి నల్లనువ్వులలోని ఐరన్ చాలా మంచిదంటారు.
నల్లనువ్వులే మేలు
నువ్వుల్లో తెలుపూ నలుపూ రంగులే కాదు, ఎరుపూ, ముదురుగోధుమా, లేతగోధుమా... ఇలా చాలానే ఉన్నాయి. వీటన్నింటిలోకీ నల్లనువ్వులు మరింత మేలు అంటారు చైనా సంప్రదాయ వైద్యులు. వీటిల్లో కాల్షియం శాతం ఎక్కువ. సెసామిన్‌, సెసామోలిన్‌... వంటి యాంటీ ఆక్సిడెంట్ల శాతమూ ఎక్కువే. ఇవి మద్యపానం కారణంగా దెబ్బతిన్న కాలేయాన్నీ కళ్లనీ బాగుచేస్తాయట. తెల్లజుట్టునీ శరీరంమీద వచ్చే ముడతల్నీ కూడా నల్ల నువ్వులు నివారిస్తాయని చెబుతుంటారు. మెలనిన్‌ ఉత్పత్తిని పెంచి, జట్టు నల్లబడేలా చేస్తాయట. ఐరన్‌ శాతమూ ఎక్కువే. టేబుల్‌స్పూను నల్లనువ్వుల్ని రాత్రిపూట నానబెట్టుకుని పరగడుపున తింటే మంచిది. వేయించీ తినొచ్చు. లడ్డూ చేసుకోవచ్చు. నానబెట్టో, వేయించో తింటే త్వరగా జీర్ణమవుతాయి.
ఆయుర్వేద వైద్యంలో...
రంగేదయినా నువ్వులన్నీ శక్తిమంతమైనవే. ఆరోగ్యాన్ని పెంచేవే. పాలిచ్చే తల్లులకు కొద్దిగా నువ్వులు పెడితే పాలు పడతాయనీ; దంత సంరక్షణకి నువ్వులు మంచివనీ; ఉదయాన్నే ఓ టీస్పూను నువ్వులనూనెను కాసేపు పుక్కిలించి ఊయడంవల్ల నోట్లో బ్యాక్టీరియా చేరకుండా ఉంటుందనీ; నులిపురుగుల్నీ నివారిస్తాయనీ; శరీరంలో వేడిని పుట్టిస్తాయి కాబట్టి చలికాలంలో నువ్వులు తినడం మంచిదనీ; ఆస్తమా రోగుల్లో శ్లేష్మాన్నీ హరించేస్తాయనీ; నెలసరి నొప్పినీ నిద్రలేమినీ తగ్గిస్తాయనీ చెబుతారు ఆయుర్వేద వైద్యులు. ఆధునిక వైద్యంలో...
కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, కాపర్‌... వంటి ఖనిజాలూ; బి-విటమిన్లూ, ప్రొటీన్లూ... ఇలా పోషకాలకు మారుపేరైన నువ్వులు వ్యాది Åనిరోధకాలు కూడా. మెగ్నీషియం రక్తప్రసరణ వ్యవస్థకు తోడ్పడుతూ మధుమేహం, బీపీలను నివారిస్తుంది. వీటిల్లోని ఫైటేట్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ క్యాన్సర్‌ కారకాలైన ఫ్రీరాడికల్స్‌ను అడ్డుకుంటుందట.
- - జింక్‌, కాల్షియం, ఫాస్ఫరస్‌... వంటి ఖనిజాల కారణంగా ఎముక వృద్ధికీ తోడ్పడతాయి. ఆస్టియోపొరోసిస్‌ని తగ్గిస్తాయి. వీటిల్లో పీచు జీర్ణశక్తికి తోడ్పడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌నూ తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్నీ పెంపొందిస్తాయి.
-- నువ్వుల్లో అధిక మోతాదులో ఉండే కాపర్‌ కీళ్లూ కండరాల నొప్పుల్నీ మంటల్నీ తగ్గించడంతోబాటు, శరీరమంతా ఆక్సిజన్‌ సరఫరాకీ తోడ్పడుతుంది.
-- వీటిల్లోని సెసమాల్‌ అనే కర్బన పదార్థం, క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తుల్లో రేడియేషన్‌ కారణంగా కణాల్లోని డీఎన్‌ఏ దెబ్బతినకుండా కాపాడుతుంది.
-- నువ్వుల నూనెని ఒంటికి మర్దన చేస్తే కీళ్లనొప్పులూ తగ్గుతాయి.