ఓట్ మీల్‌లో పీచు శాతం ఎక్కువ. కొవ్వు సమస్య వుండదు. బరువు తగ్గించుకోవడానికి ఆహారనియమాలు పాటించేవారు ఓట్ మీల్‌తో చేసిన వంటకాలు తీసుకోవటం వలన మేలు కలుగుతుంది. దీనిలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, పుష్కలంగా వుంటాయి. పరీక్షల సమయంలో పిల్లలకు కప్పు ఓట్ మీల్‌లో కొంచెం తేనె కలిపి ఇస్తే మెదడు చురుకుగా పనిచేస్తుంది. బ్లడ్ కొలస్ట్రాల్‌ను నిర్ణీత స్థాయిలో ఉంచుతూ, గుండె ఆరోగ్యాన్ని పెంచేందుకు దోహదపడతాయి. సాల్యుబుల్ (సమ్మిళతమైన పీచుపదార్ధము) ఫైబర్‌గల ఉత్తమమైన ఆహార వనరులలో ఓట్స్ ఒకటి. ఇందులోని పీచుపదార్ధాలు పొట్టనుండి ఆహారము విడుదలయ్యే వేగాన్ని తగ్గిస్తాయి. చిన్న ప్రేవులు ఆహారాన్ని సంగ్రహించే వేగాన్ని తగ్గిస్తాయి.
అందువల్ల భోజనం తీసుకొన్న వెనువెంటనే ఉత్పన్నమయ్యే ప్లాస్మా గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉండానికి అవకాశము కలదు. సాల్యుబుల్ ఫైబర్ పుష్కలంగా ఉండే ఓట్స్ ను అనునిత్యం తీసుకోవటం వలన హైపర్‌టెన్షన్ (అధికరక్తపోటు) నియంత్రణలో వుంటుంది. ఓట్స్ లో వందలకొద్ది ఫైటో కెమికల్స్ క్యాన్సర్ బారిన పడే అవకాశాలను తగ్గిస్తాయి. జీర్ణం అయిన సాల్యుబుల్ ఫైబర్, ఒక జెల్ రూపాన్ని పొంది, పొట్ట మరియు చిన్న ప్రేగుల చిక్కదనాన్ని పెంపొందిస్తాయి. ఈ జెల్ ఉదరము ఖాళీ అవటాన్ని జాప్యం చేస్తుంది. తద్వారా సదా శక్తి కలిగి ఉంటారు. అందువలన బరువు తగ్గానికి అవకాశం వుంటుంది.