చలికాలంలో లభించే తేగల వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పీచు ఎక్కువగా ఉండటం వలన రక్తంలోని చెడు కొలస్ట్రాల్ తొలగిపోతుంది. విటమిన్ బి, బి1, బి3 సి విటమిన్లు తేగలలో లభిస్తాయి.
ప్రతి రోజూ శరీరానికి అవసరమయ్యే పొటాషియం, ఒమేగా 3, క్యాల్షియంలు పుష్కలంగా తేగల నుండి లభిస్తాయి. క్యాలరీలు తక్కువగా ఉండటం వలన బరువు తగ్గాలను కున్నవారు తమ ఆహారంలో వరి అన్నం తగ్గించుకుని వీటిని తినవచ్చు.
తేగలను పిండిగా మార్చి గోధమ పిండిలాగా వాడుకోవచ్చు. తేగలలోని పీచు పదార్థం జీర్ణశక్తికి తోడ్పడుతుంది. తేగలలోని క్యాల్షియం ఎముకుల బలానికి తోడ్పడుతుంది.
తాటి కాయలనుండి తేగలు తయారవుతాయి. తాటికాయలు మార్చి, ఏప్రియల్, మే నెలలో లభిస్తాయి. వీటి నుండి తాటిముంజలు తీసి అమ్ముతారు. తాటికాయలను కోయకుండా తాటిచెట్లుకు వదలివేస్తే అవి జూన్, జులై నెలలలో పండ్లుగా మారతాయి. తాటిపండ్ల కాల్చుకుని వాటినుండి లభించే గుజ్జును కూడా తింటారు. ఈ గుజ్జు నుండే తాటి తాండ్రను తయారు చేస్తారు.
ఈ తాటి పండ్లనుండి వచ్చే టెంకెలను ఇసుక నేలaలో పాతిపెడితే మూడు నెలలలో వాటినుండి తెగలు మొలకెత్తుతాయి. వీటిని ఉడికించి లేక కాల్చి అమ్ముతారు
ఇవి పిల్లలకు మంచి పౌష్టకాహారం కూడా. పిల్లలకు చిరుతిళ్లకు బదులుగా తేగలు ఇవ్వవచ్చు