వేసవి కాలంలో మట్టికుండల వినియోగం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కాలంలో మట్టికుండలోని నీరు మనకు అవసరమైనంత చల్లగా ఉండటంతోపాటు పలు ప్రయోజనాలను అందిస్తుంది. ఆరోగ్యానికి కూడా ఈ నీరు తాగడం అత్యుత్తమం. కుండలోని నీరు సహజసిద్ధంగా చల్లబడుతుంది. అందుకే ఈ నీరు శరీరానికి హాని చేయదు.
అయుర్వేద నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం కుండలోని నీటిని వినియోగించడం వలన జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది. ఈ నీటివలన శరీరంలోని టెస్టోస్టెరాన్ స్థాయి పెరుగుతుంది.
ఈ నీటిలో మిళితమైన మట్టి లక్షణాల కారణంగా మలినాలు తొలగిపోతాయి. ప్రయోజనకర మినరల్స్ అందుతాయి. శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఫ్రిజ్లోని నీటి కన్నా కుండలోని నీరు ఆరోగ్యదాయకం. ఇది శరీర ఉష్ణోగ్రతను తగిన స్థాయిలో నిలిపివుంచుతుంది. ఫ్రిజ్లోని నీరు తాగడంతో వచ్చే గొంతు సమస్యలు కుండలోని నీటితో తలెత్తవు. చల్లటి ఫ్రిజ్ నీరు తాగితే గొంతు సమస్యలు, జలుబు రావటానికి అవకాశం ఉంది.
వేసవి కాలంలో ప్రతి కుటుంబం ఒక కుండ కొంటే దాని వలన కుండల తయారీదారులకు కొంత ప్రయోజనం కలుగుతుంది.