తేనె యొక్క స్వచ్ఛతను గుర్తించేందుకు కొన్ని సులువైన చిట్కాలు
01. ఒక గ్లాసు నీరు తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ తేనెను వేయండి. తేనె స్వచ్ఛమైనది కాకపోతే నీటిలో కరుగుతుంది. స్వచ్ఛమైన తేనె ఐతే కరగకుండా అలాగే గ్లాసు అడుగుకు మునిగిపోతుంది.
02. కాటన్‌తో (నూలుతో) చేసిని వత్తిని (దీపారాధనకు వాడే వత్తులు) తీసుకొని తేనెలో ముంచి వెలిగించండి. స్వచ్ఛమైన తేనె ఐతే చిటపటలు లేకుండా చక్కగా వెలుగుతుంది. కల్తీ తేనె ఐతే చిటపటలాడుతూ వెలుగుతుంది. లేక వెలగదు.
03. మీ ఇంట్లో బ్లాటింగ్ పేపర్ ఉంటే దాని మీద ఒక స్పూన్ తేనెను వేయండి. కల్తీ తేనె ఐతే బ్లాటింగ్ పేపర్ పీల్చుకుంటుంది. స్వచ్ఛమైన తేనె ఐతే బ్లాటింగ్ పేపర్ పీల్చదు.
04. బ్లాటింగ్ పేపర్ మీ దగ్గర లేకపోతే కొద్దిగా తేనెను తెల్లటీ కర్ఛీఫ్ మీదగాని తెల్లటి వస్త్రం మీదగాని వేయండి. క్లాత్/కర్చీఫ్‌ను నీటిలో శుభ్రపరచండి. స్వచ్ఛమైన తేనె ఐతే మరక మిగలదు (అంటదు) మరక పడితే అది కల్తీ తేనె కావచ్చు.