header

Quality Vegetables…..

Quality Vegetables…..

నాణ్యత గల కూరగాయలను ఎంచుకునే విధానం
ఉల్లిపాయలు ఇవి ఎక్కువ రోజు నిల్వఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఎంచుకోవాలి. తడిగా రంగు మారినవి కొనకూడాదు. ఉల్లిపాయను చేతిలోకి తీసుకున్నపుడు బయటి పొట్టు సులువుగా వచ్చేలా ఉంటే అవి మంచివి.
బంగాళాదుంపలు బంగాళాదుంపలపై ఆకుపచ్చ రంగు ఉన్నా, చిన్న చిన్న మొలకలు వచ్చినా వాటిని కొనరాదు. సాధారణంగా మరీ పెద్దవి కాకుండా, మరీ చిన్నవి కాకుండా మధ్యస్థమైన సైజులో ఉన్నవాటిని ఎంచుకోవాలి.
క్యాబేజీ క్యాబేజీ గట్టిగా పొరలు అతుక్కుని టైట్‌గా ఉండాలి. అవి మంచివే కాక రుచిగా వుంటాయి.
బెండకాయలు బెండకాయలు ఎంపికలో జాగ్రత్తగా వుండాలి. మరీ పెద్దగా ఉన్న కాయలు రుచి తక్కువగా వుంటాయి. కాయలు చిన్నగా, నూగుతో నవనవలాడుతూ వుండాలి. లోప గింజలు చిన్నగా ఉండే కాయలు బావుంటాయి. బెండకాయ చివరి భాగం విరవగానే విరగాలి.
కొత్తిమీర సాధారణంగా కొత్తిమీర కట్టలు కట్టి అమ్ముతారు. లేత ఆకుపచ్చరంగులో ఉండి బాగా పొడుగ్గా ఉండే కట్టలు హైబ్రీడ్ కొత్తిమీర కట్టలు. ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న పొట్టి సైజ్ ఉన్న కొత్తిమీర కట్టలు నాటువి.