డాక్టర్ లహరి సూరపనేని, న్యూట్రిషనిస్ట్, వెల్ నెస్ కన్సల్టెంట్, సౌజన్యంతో....
దక్షిణ అమెరికాకు చెందిన ఈ చిరుధాన్యం ...ఇటీవల ప్రపంచవ్యాపంగా పేరు పొందాయి. కార్బో హైడ్రేట్స్ తక్కువగా ఉండి, ప్రోటీన్స్ పుష్కలంగా ఉండే ఇవి హెల్దీ ఫుడ్ గా చెప్పవచ్చు. వరి, గోధుమల కంటే మంచివి అంటారు. క్వినోవాలో అధిక ప్రోటీన్లు, అవసరమైన కొవ్యు పదార్ధాలు ఉంటాయి. ఈ ప్రోటీన్లు ఎంతో మేలు కలిగించే లైసిన్, మెధియానైన్ లాంటి అవసరమైన యమినో యాసిడ్లతో తయారైనవి కావటం విశేషం. క్వినోవాలో ఇన్ ఫ్లమేషన్ నివారించటానికి అవసరమైన ఫాటీ యాసిడ్లు ఒమేగా – 6, ఒమేగా-3 ఆరోగ్యకరమైన నిష్పత్తిలో ఉండి గుండె సంబంధిత వ్యాధులనుండి రక్షణ కల్పిస్తాయి.
క్యాల్షియం, ఐరన్ లాంటి ఖనిజాలు పీచు పదార్ధాలు కూడా తగిన మోతాదులో ఉన్నాయి. ఫినోలిక్స్, బెటానిక్స్, కారొటోనాయిడ్స్ వంటి బయో యాక్టివ్ ఫైటో కెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపును నొప్పిని తగ్గించేవి గానూ, క్యాన్సర్ నిరోధకాలుగా ఉపయోగపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లుగా ఉపయయోగపడతాయి. వీటిలోని ఫినోలెక్స్ రక్తంలోని చక్కెర శాతాన్ని నియంత్రించే ఆల్ఫా గ్లూకో సిడేస్, పాంక్రోయేట్ లైపేజ్ వంటి ఎంజైములపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ఇన్నిరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి వీటిని బియ్యం బదులు వాడుకోవచ్చు. ప్రస్తుతానికి ఇవి విరివిగా లభించటం లేదు. ఖరీదు కూడా ఎక్కువే ఆన్ లైన్ షాపులలో దొరకుతాయి.