header

Rasins

ఎండు ద్రాక్ష / కిస్ మిస్ లు / రైసిన్స్

ఎండు ద్రాక్ష / కిస్ మిస్ లు / రైసిన్స్ వీటిలో గల యాంటీ మైక్రోబియల్, యాంటీ ఎసిడిటీ, యాంటీ ఆక్సిడెంట్ ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్నాయి. ఆయర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. ఎక్కువగా తినేవారు ప్రతిరోజూ ఓ గుప్పెడు ఎండుద్రాక్షను తీసుకుంటే శరీరానికి చాలినంత శక్తి సమకూరుతుంది. వీటిలో ఉండే సింపుల్ కార్బ్స్ ప్రధానంగా గ్లూకోజ్, ఫ్రక్టోజ్ లకు ఆధారం జీర్ణశక్తి సరిగా లేనివారు ఒక టీస్పూన్ నానబెట్టిన ఎండుద్రాక్షను తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వీటిలోని అత్యధికపీచు జీర్ణశక్తిని సహకరిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఎండుద్రాక్ష మంచి ఆహారం. భోజనానికి ముందుగా కొద్దిగా ఎండుద్రాక్ష తీసుకుంటే కడుపు నిండిన భావన కలిగి అతిగా తినటానికి అడ్డుకట్టువేస్తుంది. మెనోపాజ్ దశ తర్వాత మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఆస్టియో ఆర్ధ్రరైటిస్. రోజూ కొద్దిగా వీటిని తింటే వీటిలోని క్యాల్షియం వలన ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిని తినటం వలన ఎసిడిటి నుండి ఉపశమనం కలుగుతుంది. బాదంపప్పులు, అవిసెగింజల పొడి, నువ్వుల పొడిలో వీటిని కలుపుకుని తింటే రక్తం పడుతుంది. ఎండుద్రాక్షకు రక్తాన్ని శుద్ధిచేసే గుణం ఉంది. రక్తంలోని ట్యాక్సిన్లను మార్చడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. వీటిలోని ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్, పొటాషియం మొదలైనవి శిరోజాలకు సరిపడినంతగా పోషణ నిస్తాయి.