header

Raw Mango benefits….పచ్చి మామిడి ఉపయోగాలు.......

Raw Mango benefits….పచ్చి మామిడి ఉపయోగాలు.......

పచ్చి మామిడికాయ పేరు చెప్పగానే పులుపు గుర్తుకు వచ్చి నోరు ఊరుతుంది అందరికీ...ముఖ్యంగా పిల్లలకు..... ఆరోగ్య పరంగా కూడా పచ్చిమామిడి చాలామంచిది.....
పచ్చి మామిడికాయ ఒంటి వేడిని తగ్గించి, శరీరాన్ని చల్లబరుస్తుంది.. శరీరంలో ద్రవాల స్థాయి తగ్గకుండా చూస్తుంది.. వడదెబ్బ కొట్టకుండా పచ్చిమామిడికాయను తినటం మంచిది. మధుమేహంతో బాధపడేవారు పచ్చిమామిడికాయలను పెరుగు, అన్నంతో తీసుకుంటే సుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి. ఎలక్ట్రొలైట్స్‌ను పచ్చిమామిడికాయ బ్యాలెన్స్‌ చేస్తుంది. దీనితో రక్తప్రసరణ అదుపులో ఉండి, గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. పచ్చిమామిడి మన శరీరంలో క్యాలరీలు కరిగించి, బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది. పచ్చి మామిడిలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది.
ఎసిడిటీ నుంచి దూరం కావొచ్చు. వాతావరణంలో మార్పుల కారణంగా వచ్చే వైరల్‌ ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తుంది..
వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. కాలేయ సంబంధిత సమస్యలు నివారించడంలో పచ్చి మామిడి శక్తిమంతంగా పనిచేస్తుంది. ఒక ముక్క పచ్చి మామిడి నమలడం వల్ల ప్రేగులు శుభ్రపడి, బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ దూరమవుతాయి. పంటి ఆరోగ్యం మెరుగవుతుంది. చిగుళ్లు బలంగా అవుతాయి. చిగుళ్ల నుంచి రక్తస్రావం తగ్గి, దుర్వాసన పోతుంది. కొత్త రక్త కణాలు ఏర్పడటానికి సహాయపడుతుంది.
పచ్చి మామిడిరసం తాగడం వల్ల అధిక చెమటను నివారించుకోవచ్చు. మలబద్దకం సమస్యను దూరం చేస్తుంది పెద్ద పేగు ఆరోగ్యాన్ని పెంచుతుంది. వేసవి ఎండ కారణంగా శరీరం కోల్పోయే సోడియం, ఐరన్‌ వంటి ఖనిజాలను తిరిగి భర్తీ చేస్తుంది. శరీరానికి తక్షణ శక్తిని అందించి, వేడిని తగ్గిస్తుంది.