header

Raw Tamarind….లేత చింతకాయలు ఆరోగ్యానికి మేలు...

Raw Tamarind….లేత చింతకాయలు ఆరోగ్యానికి మేలు...

- శీతాకాలంలో జీవక్రియలు అంత చురుగ్గా ఉండవు. ఫలితం.. శరీరంలో వ్యాధినియంత్రణ శక్తి తగ్గి...
దగ్గు, జలుబు, జ్వరం వంటివి సులభంగా దాడి చేస్తాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది పచ్చిచింత. వ్యాధినిరోధక విటమిన్‌గా చెప్పే థయామిన్‌ రోజువారీ అవసరాల్లో 36 శాతం తీరుస్తుంది.
- చింతలో డైటరీ ఫైబర్‌, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి హానిచేసే ఫ్రీరాడికల్స్‌ని సమర్థంగా ఎదుర్కొంటుంది. అందుకే శరీరంలోని వ్యర్థాలు నివారించడానికి చింత బాగా ఉపయోగపడుతుంది. - ఇనుము, ఫోలిక్‌యాసిడ్‌, ఎ విటమిన్‌ వంటి విటమిన్లు స్త్రీలల్లో రక్తహీనత రాకుండా చూస్తాయి.
- దీనిలోని పొటాషియం గుండె జబ్బులు రాకుండా చూస్తుంది.