header

Best Rice, Rice Varities

బియ్యం పేరు ప్రొటీన్లు ఐరన్ జింక్ పీచు
తెల్లబియ్యం 6.8 1.2 0.5 0.6
దంపుడు బియ్యం 7.9 2.2. 0.5 2.8
పర్పుల్ బియ్యం 8.3 3.9 2.2 1.4
ఎర్రబియ్యం 7.0 5.5 3.3 2.00
నల్లబియ్యం 8.5 3.5 0 4.9
నల్లబియ్యం :

ఇవి అన్నిటికంటే ప్రత్యేకమైనవి మరియు విలువైనవి. ఇవి అనేక ఆసియా దేశాలతో పాటు మనదేశంలో కూడా పండుతున్నాయి. ఈశాన్య భారతీయులు వీటిని చాలాకాలం నుండి ఉపయోగిస్తున్నారు. మణిపూర్లో వీటి వాడకం ఎక్కువ. ఇతర రకాలతో పోలిస్తే వీటిలో పోషకాల శాతం ఎక్కువ. ఐరన్ అయితే మరీ ఎక్కువ. పీచూ అధికమే. ప్రొటీన్లు కూడా ఎక్కువే. ఏ రంగు బియ్యంలో అయినా అంధోసైనిస్ అనే వర్ణద్రవ్యం ఎక్కువగా ఉండటమే ఆయా రంగులకు కారణం. ఇవి అద్భతమైన యాంటీ ఆక్సిడెంట్ లుగా పనిచేస్తాయి. కొలస్ట్రాల్ తగ్గుతుంది.ఫలితంగా గుండెజబ్బులు రావు. డయాబెటిస్, అల్జీమర్స్, కేన్సర్ వంటి వ్యాధులను ఎదుర్కోవటంలో ఈ వర్ధద్రవ్యానికి మించినది లేదు. అందుకే బ్లాక్ రైస్ ను సూపర్ ఫుడ్ గా చెబుతారు. మిగిలిన వాటితో పోలిస్తే నల్లబియ్యంలో క్యాలరీలు తక్కువ, పీచు ఎక్కువ అందువలన కాస్త తినగానే పొట్టనిండిపోతుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇవి మంచి ఆహారం.

ఎరుపు రంగు బియ్యం:

కేరళలో పండించే ఎరుపురంగు బియ్యంలో కూడా ఔషధగుణాలు ఎక్కువగా వుంటాయి. ఆయుర్వేదంలో వీటి శాస్తికబియ్యం అని అంటారు.యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే పాలీ ఫినాల్ వీటిలో సమృద్ధిగా ఉంటాయి. శరీర పనితీరును సమతుల్యంగా ఉండేలా చూస్తాయి. జింక్, ఐరన్లు కూడా తెల్లబియ్యంకన్నా మూడురెట్లు ఎక్కువగా ఉంటాయి . ఈ ధాన్యం ఎంతకాలమైనా పురుగుల బెడదలేకుండా నిల్వఉంటాయి.


దంపుడు బియ్యం
అత్యంత ఆరోగ్యకరమైన బియ్యం ఇవి. పొట్టి మరియు పొడుగు రకాలలో దొరకుతాయి. ఉడకటానికి కొంచెం సమయం ఎక్కువ పడతుంది. నీరు కూడా మామూలు బియ్యం కన్నా ఎక్కువ పడతాయి. విటిలో పీచు ఎక్కువగా ఉండటం వలన నిదానంగా అరుగుతాయి. మరియు కొంచెం తినగానే కడుపు నిండుతుంది. దీనివలన త్వరగా ఆకలి వేయదు. డయాబెటిక్ వారికి, బరువు తగ్గాలనుకునే వారికి ఊబకాయం వారికి మంచి ఆహారం.
పొట్టు కింద ఉండే తవుడు పొరలో విటమిన్లు, ఖనిజాలు దండిగా ఉంటాయి. పాలిష్ పట్టినపుడు తవుడుతో పాటు ఇవన్నీ తొలగించబడతాయి. అందుకే అవి తెల్లగా మారతాయి. తెల్ల బియ్యం కన్నా దంపుడు బియ్యమే మంచివని పరిశోధకులు చాలాకాలంగా చెబుతూనే ఉన్నారు.
వారానికి ఐదు, అంతకన్నా ఎక్కువసార్లు తెల్లబియ్యం తీసుకోవటం వల్ల మధుమేహం ముప్పు పెరుగుతున్నట్టు హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు గుర్తించారు. తెల్లబియ్యాన్ని 50 గ్రాములు తగ్గించి, వాటి స్థానంలో దంపుడు బియ్యాన్ని చేర్చుకుంటే మధుమేహం ముప్పు 16% వరకు తగ్గుతున్నట్టు తేలింది కూడా. అంతేకాదు, రక్తపోటు పెరగటానికి దోహదం చేసే సోడియం పాళ్లు కూడా దంపుడు బియ్యంలో తక్కువే. ఇక పోషకాల పరంగా చూస్తే- మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మలచటంలో కీలకపాత్ర పోషించే నియాసిన్, విటమిన్ బి3 వీటిల్లో చాలా ఎక్కువ.
వీటిల్లోని మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుంది. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి, విశృంఖల కణాలను అడ్డుకోవటానికి తోడ్పడే సెలీనియం కూడా దంపుడు బియ్యంలో దండిగానే ఉంటుంది. వీటిల్లోని లిగ్నాన్లనే పాలీఫెనాల్స్ పేగుల్లోకి చేరిన తర్వాత ఫైటోఈస్ట్రోజన్ ఎంటెరోలాక్టేన్గానూ మారతాయి.
ఇవి క్యాన్సర్ నివారకంగా పనిచేయటమే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉండటానికీ దోహదం చేస్తాయి. ఇక వీటిలోని పిండి పదార్థం నెమ్మదిగా జీర్ణమవుతుంది. అందువల్ల రక్తంలో గ్లూకోజు స్థాయులు అంత త్వరగా పెరగవు. కడుపు నిండిన భావన కలిగించటం వల్ల వెంట వెంటనే ఆకలి వేయదు కూడా.

పొట్టి బియ్యం
పొట్టిబియ్యం ఎక్కువ స్టార్చీగా (గంజి చిక్కదనం) గా ఉండి మెతుకులు అంటుకునే గుణం ఎక్కువగా ఉంటుంది. (సోనా మసూరి, బి.పి.టి మొదలగునవి)
పొడుగు బియ్యం
తక్కువ స్టార్చీగా (గంజి చిక్కదనం) గా ఉండి వండినపుడు మెతుకులు విడివిడిగా ఉంటాయి.
జాస్మిన్ మరియు బాస్మతి
ఈ రకం బయ్యం పొడుగుగా ఉండి సువాసనతో ప్రత్యేకత కలిగి ఉంటాయి.
తెల్లబియ్యం
డాక్టర్ గార్గి శర్మ ( వెయిట్ లాస్ మేనేజ్ మెంట్ నిపుణుడు-ఢిల్లీ) అభిప్రాయం ప్రకారం బియ్యం తెల్లగా పాలిష్ పట్టటం వలన పైపొరలో ఉండే విటమిన్ బి మరియు ఇతర నూట్రియంట్స్ లు కోల్పోతాయి.
డాక్టర్ రిటికా సమాద్దార్ (Max Healthcare Saket, New Delhi, ) అభిప్రాయం ప్రకారం మిల్లింగ్ మరియు పాలిష్ చేయటం వలన 67 శాతం విటమిన్ బి3 మరియు 80 శాతం విటమిన్ బి1, 90 శాతం విటమిన్ బి6, మాంగనీస్ సగం, ఫాస్పరస్ సగం, ఐరన్ 60 శాతం, పీచు పూర్తిగా కోల్పోతాయి. దీని వలన అన్నం తిన్న వెంటనే త్వరగా అరిగి రక్తంలో గ్లూకోజ్ శాతం పెరిగి ఊబకాయానికి దారితీస్తుంది. త్వరగా అరగటం వలన వెంటనే ఆకలి వేస్తుంది. డయాబెటిక్ పేషంట్లకు రక్తంలో షుగర్ శాతం త్వరగా పెరుగుతుంది.