header

slimming food

Healthy Food for Slimming / సన్నబడటానికి సహజమైన ఆహారం

mirch powder కారం : నాలుకకు తగిలితే చురుక్కుమనిపించే మిరపపొడిలో క్యాప్సినాయిడ్స్ టాయి. ఇవి కొవ్యును కరిగిస్తాయి. కాని నేరుగా కారంను తినరాదు. కూరలలో మాత్రమే వాడాలి.grapes ద్రాక్ష : ప్రతి భోజనానికి ముందుగా కొద్దిగా ద్రాక్షపండ్లు తింటే చుట్టుకొలత ఓ అంగుళం తగ్గిందనే అరిజోనా యూనివర్శిటీ అధ్యయనంలో గుర్తించారు.
lowfat cottege cheese లోఫ్యాట్ కాటేజ్ ఛీజ్ : వయసు పెరిగే కొద్దీ జరిగే మజిల్ లాస్ మెటబాలిజాన్ని ప్రభావితం చేస్తుంది.bell peppers బెల్ పెప్పర్ : విటమిన్ సి తిరుగులేని బరువు తగ్గించే ఆయుధం. ఒక క్యాప్సికం దైనందిన అవసరానికి రెండురెట్లు ఎక్కువగా విటమిన్ ‘ సి’ ని అందుస్తంది.lettuce లెట్యూస్ : ఆకుకూరలు పూర్తిస్థాయి సంఖ్యలో క్యాలరీలను తగ్గస్తాయి.


nuts నట్స్ : వీటిలోని ప్రొటీన్ ఆరోగ్యవంతమైన ఫ్యాట్, పీచు సన్నబడటానికి సహకరిస్తాయి. ఆహారం తినాలన్న కోరికను ఇవి నెమ్మదింప జేయగలవుkharbooja ఖర్భూజా : ఒక ముక్క ఖర్భూజాలో కేవలం 45 క్యాలరీలు మాత్రమే ఉంటాయి.

beens బీన్స్ : ప్రొటీన్లు, హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్లతో నిండివుంటాయి. ఇవి ఎక్కువసేపు కడుపు నిండిన భావాన్నిచ్చి, గంటలకొద్దీ సంతృప్తిగా ఉంచుతాయి.

డార్క్ చాక్లెట్ : ఇవి కొద్దిగా తిన్నా ఎక్కువగా తిన్నట్లు అనిపిస్తుంది. మిగతా పదార్ధాలు మితంగా తినటానికి తొడ్పడుతుంది. శరీరంలోని అధిక కొవ్వును సహజసిద్ధంగా ఆహారపు అలవాట్లను మార్చుకొని కరిగించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అందుకు కొన్ని మార్గాలు
ఉదయాన్నే పరగడుపున (ఏమీ తినకుండా) గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయను పూర్తిగా పిండి అందులో కొద్దిగా తేనెను కలుపుకొని తాగాలి. కొవ్వను కరగించే గుణాలు నిమ్మకాయలో ఉన్నాయి. కానీ వెంటనే ఫలితాన్నివ్వదు. కనీసం రెండునెలలు ఇలా చేయాలి.
అల్లం
కొవ్వును కరగించడంలో అల్లం అద్భుతంగా పనిచేస్తుండి. ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా అల్లం రసం కలుపుకుని తాగితే ఫలితం వస్తుంది.
వెల్లుల్లి
వెల్లుల్లిలో కొవ్వును కరిగించే గుణాలు ఎక్కువ. ప్రతిరోజూ కొన్ని వెల్లుల్లి రేకలను తింటే ఫలితం వస్తుంద. ముఖ్యంగా పొట్టదగ్గర పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది.
బాదం పప్పు
బాదంపప్పులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ కొన్ని బాదం పప్పులను నానబెట్టుకుని తింటే కొవ్వు కరుగుతుంది.
పుదీనా
కొద్దిగా పొదీనా ఆకులనుండి రసం తీసుకుని ఆ రసాన్ని ఒక గ్లాసు నీటిలో కలుపుకొని ఉదయాన్నే తాగాలి. దీనితో పొట్టదగ్గర పేరుకొని పోయిన కొవ్వు తగ్గుతుంది.
పుచ్చముక్కు, కీరా ముక్కలు
భోజనానికి ముందు పుచ్చముక్కలు గానీ, కీరా దోసకాయముక్కలను గానీ భోజనానికి ముందు తిని తరువాత భోజనం చేస్తే తక్కువగా తింటారు. అందువల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
కెనోలా నూనెతో పొట్ట దగ్గర కొవ్వు కరిగించవచ్చు....
కెనోలా నూనెను వరుసగా నాలుగు వారాలపాటు వాడడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుందని షెన్ స్టేట్ విశ్వవిద్యాలయ నిపుణులు చెబుతున్నారు. పైగా నడుం చుట్టకొలత పెరిగిపోవడం వల్ల గుండెరోగాలు, మధుమేహం వంటి రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే పొట్ట పెరిగిన కొందరిని ఎంపిక చేసి వాళ్లకి నెలరోజులపాటు ఆహారంలో భాగంగా రోజూ 60గ్రాముల కెనోలా నూనె తీసుకునేలా చూశారట. ఉదాహరణకి రోజుకి 3000 క్యాలరీల ఆహారాన్ని తీసుకునే వ్యక్తికి అందులో 18శాతం క్యాలరీలు కేవలం ఈ నూనె ద్వారానే లభించేలా ఆహారాన్ని మార్చి ఇచ్చారు. చిత్రంగా వారిలో అంతకుముందుకన్నా పొట్ట బాగా తగ్గిందని తేలింది. అదీగాక ప్రత్యేకించి ఓ భాగంలో పేరుకున్న కొవ్వును కరిగించడం అనేది ఆహారం ద్యారా సాధ్యం కాదు. కానీ మోనో అన్ శాచ్యురేటెడ్ ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారం ద్వారా అది సాధ్యమేనని నిపుణులు అంటున్నారు.