Soamp Seeds
సోంపు గింజలు : భోజనం తరువాత సోంపుగింజలను తినటం రిలీఫ్ గా తేలిగ్గా ఉంటుంది. వీటిని గాలి తగలని డబ్బాల్లో నిల్వ ఉంచాలి. ఆరు నెలల కంటే మించి నిల్వ ఉంచరాదు. సూర్వరశ్మి తగలరాదు. వీటిని జాగ్రత్తగా ఎంచుకోవాలి.గింజలు లావుగా, ముడతలు లేకుండా, గట్టిగా ఉండాలి, మంచివాసనతో ఉండాలి.
ఔషధప్రయోజనాలు : భోజనం తరువాత వాడే ఈ గింజలు మౌత్ ఫ్రెషనర్ గా ఉపయోగపడతాయి.
ఈగలు వంటి వాటికి వీటి వాసన పడదు. వీటిని పారద్రోలేందుకు సోంపుగింజల పొడిని వాడతారు.
ఆకలిని వృద్ధి చేస్తుంది. మంచి జీర్ణకారి. విరోచనం సాఫీగా కావటానికి సహకరిస్తుంది.
సోంపు ఆకులు జాయింట్ నొప్పుల నుంచి ఉపశమనం ఇవ్వటంలో సహకరిస్తాయి.
సోంపుగింజల పొడి అజీర్తిని, డయోరియాను, కడుపునొప్పిని తగ్గిస్తుంది. శ్వాసకోస సంభంధమైన దగ్గు, జలుబు నుండి ఉపశమనాన్ని ఇస్తుంది.
సోంపు గింజలు కొవ్వును కరిగిస్తాయి. బరువు తగ్గటానికి సహకరిస్తాయి.