శెనగల మొలకలు
వీటి మొలకలలో కార్బో హైడ్రేట్స్, విటమిన్ బి6లు ఉంటాయు. ఇవి బరువును తగ్గించటంలో సహకరిస్తాయి. వీటిలో కొలస్ట్రాల్ ఉండదు. డయాబెటిస్ వారికి మంచిది. చర్మసమస్యలు తగ్గుతాయి. తరతరాలుగా భారతీయ వంటకాలలో ఇవి ఒక భాగం. బ్రేక్ ఫాస్ట్, లంచ్ లేదా స్నాక్స్ గా తినవచ్చు. శెనగల మొలకలు రావటాని సమయం పడుతుంది. ఒక రోజంతా నానబెట్టి తరువాత గట్టిగా మూటకట్టి మొలకలు వచ్చేదాకా ఉంచాలి. నూలు గుడ్డలో మూట కట్టి ఉంచితే (సుమారు 12 గంటలు) మొలకలు గుడ్డను చీల్చుకొని బయటకు వస్తాయి.