బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఆహారం మొలకలు. ఆరోగ్య ప్రయోజనాలతో పాటు చర్మ సౌందర్యానికి కూడా మొలకలు మంచివంటారు. వీటిని బ్రేక్ ఫాస్ట్ గానూ, స్నాక్స్ లాగానూ తినవచ్చు. కడుపుబ్బరం, గ్యాస్ ట్రబుల్ గలవారు తగు మాత్రంగా తినాలి. లేదా డాక్టర్ గారి సలహా అనుసరించి తినాలి. మొలకలను శుభ్రంగా కడిగి తినాలి. వీటిని నేరుగా తినవచ్చు లేదా కొద్దిగా ఉప్పు, నిమ్మరసం, అల్లం తురుము, కొత్తిమీర, క్యారెట్ తురుము కలుపు కొని తినవచ్చు
పెసర మొలకలు
కాబూలి శెనగల మొలకలు
శెనగల మొలకలు
బీన్స్ మొలకలు