కాబూలి శెనగల మొలకలు
వీటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వ్యాయామం చేసే వారికి మంచిది. వీటిలోని పీచుపదార్ధం కడుపు నిండిన భావం కలిగిస్తుంది. రక్తంలోని చక్కెర శాతాన్ని కూడా క్రమబద్ధీకరిస్తుంది.
కాబూలి శెనగల మొలకలు కొలస్ట్రాల్ ను తగ్గిస్తాయి. వీటిలో క్యాలరీలు, ఫ్యాట్ తక్కువగా ఉంటాయి. గుండె సంబంధిత రుగ్మతల నుండి కాపాడుతాయి. బ్రేక్ ఫాస్ట్ లేక లంచ్ లేక స్నాక్స్ గా తినవచ్చు. వీటి మొలకలు రావటానికి సుమారు 24 గంటలు పడుతుంది. 12 గంటల సేపు నానబెట్టి, 12 గంటలసేపు మూట గట్టి ఉంచాలి.