header

Sprouted Green Grams

Sprouted Green Grams.. పెసర మొలకలు

sprouted green grams

విటమిన్ సి మరియు కె లకు పెసలు నెలవు. శిరోజాలుఎదుగుదలకు విటమిన్ సి సహకరస్తుంది. జుట్టు బలహీనపడి చిట్లి పోకుండా పలుచబడిపోకుండా కాపాడుతుంది. పెసల మొలకలలో ఫోలెట్లు సమృద్ధిగా ఉంటాయి.
వెన్నుముక సమస్యలను, పుట్టుకతో వచ్చే మొదడు లోపాలను అడ్డుకుంటాయి. యక్తవయసులో పెసల మొలకలను తప్పనిసరిగా స్వీకరించటం మంచిది. పెసర మొలకలను ఇంట్లో తయారు చేసుకొవటం మంచిది.
తయారు చేసుకొనే విధానం : అన్ని గింజల కంటే పెసల మొలకలు తయారు చేసుకోవటం చాలా సులువు. ముందుగా పచ్చపెసలను రాళ్ళు, మట్టిగడ్డలు లేకుండా శుభ్రం చేసుకొని ఉదయంపూట మంచినీళ్ళలో నానబెట్టుకోవాలి(సుమారు 8 గంటలసేపు) తరువాత వీటిని శుభ్రంగా కడిగి నీరు ఒంపివేసి, తడిగుడ్డ (నూలు గుడ్డ)లో గట్టిగా మూటకట్టి రాత్రంతా ఉంచాలి (సుమారు 8 గంటలసేపు). తెల్లవారేసరికి పెసలకు మొలకలు వస్తాయి. వీటిని అలాగే నేరుగా తినవచ్చు. లేదా కొద్దిగా అల్లం తురుము, నిమ్మరసం, కొత్తిమీర కలుపుకొని తినవచ్చు.
జాగ్రత్తలు : పెసల మొలకలు తినబోయే ముందు వాటిని శుభ్రంగా కడిగి పాడైపోయిన వాటిని ఏరివేయాలి. కడుపుబ్బరం, గ్యాస్ ట్రబుల్ ఉన్నవారు తక్కువగా తినాలి.